అచ్చు గుద్దినట్లు ఆమెలానే..

Mon 24th Feb 2020 05:39 PM
kangana,thalaivi,kl vijay  అచ్చు గుద్దినట్లు ఆమెలానే..
Kangana Looking like Amma అచ్చు గుద్దినట్లు ఆమెలానే..
Sponsored links

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథతో తలైవి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కే ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జయలలిత జీవితం మీద వస్తున్న బయోపిక్ లలో ఎక్కువ బజ్ ఉన్న చిత్రం ఇదే కావడం విశేషం.

 

తలైవి చిత్రంలో జయలలిత జీవితంలో ముఖ్య సంఘటనలు చూపిస్తారని తెలుస్తుంది. ఆమె బాల్యం మొదలుకుని, సినిమా జీవితం, రాజకీయాల్లో ప్రవేశం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అవడం వరకు అన్నింటినీ చూపిస్తారట. ఇందులో కంగన నాలుగు గెటప్ లలో కనిపించనుందట. నేడు జయలలిత ౭౫ వ జయంతి సందర్భంగా తలైవి చిత్రం నుండి కంగ నలుక్ ని రివీల్ చేశారు. ఈ లుక్ లో కంగన అచ్చం జయలలిత గారి లాగానే కనిపిస్తుంది.

 

రాజకీయాల్లో ప్రవేశించినపుడు జయలలిత గారు ఏ విధంగా ఉన్నారో అచ్చం అదే రీతిలో ఉన్న ఈ  లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నలుపు ఎరుపు బోర్డర్ కలిగి ఉన్న తెల్లచీరలో చాలా సాదాసీదాగా ఉన్న ఈ పిక్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పిక్ లో చూసిన వారంతా అచ్చం అమ్మలాగే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్ లుక్ కి వచ్చిన నెగెటివిటీ ఈ లుక్ తో  పూర్తిగా పోయింది. అచ్చం అమ్మలా ఉన్న కంగనా లుక్ ని చూసి ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Sponsored links

Kangana Looking like Amma:

Kangana look revealed from Thalaivi..

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019