కొరటాల మూవీలో చిరు లుక్ లీక్.. ఫ్యాన్స్ ఫిదా!

Sun 23rd Feb 2020 11:29 PM
chiranjeevi,koratala siva,new movie,acharya,look leak  కొరటాల మూవీలో చిరు లుక్ లీక్.. ఫ్యాన్స్ ఫిదా!
Chiranjeevi’s Leaked Look from Acharya కొరటాల మూవీలో చిరు లుక్ లీక్.. ఫ్యాన్స్ ఫిదా!
Sponsored links

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు రాం రాం చెప్పేసి వచ్చిన తర్వాత  మంచి ఊపు మీదున్నారు. ఇప్పటికే ‘ఖైదీ నంబర్-150’, ‘సైరా’తో పాత చిరంజీవిని చూసుకుంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చిరు సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ పలు రకాలుగా వార్తలు రాగా.. వాటిపై ఒక్కసారి కూడా అటు డైరెక్టర్ గానీ.. నిర్మాతగానీ రియాక్ట్ అవ్వలేదు. మరోవైపు సినిమా కథ ఇలా ఉండబోతోంది..? ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారని.. అబ్బే చెర్రీ కాదు బన్నీ అని.. అయ్యో బన్నీ కూడా కాదు సూపర్‌స్టార్ మహేశ్‌బాబును ఒప్పించి దగ్గరుండి మరీ చెర్రీ చేయిస్తాడని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. దీంతో అసలు ఎవరు నటిస్తున్నారో..? ఏంటో తెలియక మెగాభిమానులు తికమకపడ్డారు.

అయితే ఈ క్రమంలో మెగాభిమానులు ఎగిరి గంతేసే విషయం ఒకటి వెలుగుచూసింది. చిరు షూటింగ్‌లో ఉండగా.. ఎవరో క్లిక్‌మనిపించారో కానీ ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో మెడలో ఎర్ర కండువాతో మెగాస్టార్‌ కనిపించాడు. దీంతో మెగాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు ‘అదిరిపోయిందంతే’ అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోను మెగాభిమానులు, సినీ ప్రియులు తెగ షేర్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే చిరు-కొరటాల మూవీని కూడా లీక్స్ వెంటాడుతున్నాయ్. మరి ఈ లీకైన వ్యవహారంపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో!

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ ఈ చిత్రంలో దేవాదాయ శాఖ‌ అధికారిగా పనిచేస్తున్నారని పుకార్లు వచ్చిన విషయం విదితమే. ఈ శాఖలో జరిగే అవినీతి అక్రమాల‌ నేపథ్యంలోనే సినిమా స్టోరీ ఉంటుందని టాక్ నడిచింది. ఇందులో మెగాస్టార్ డ్యూయల్ రోల్ అని.. అధికారిగా చిరు నటిస్తారని.. యంగ్  మెగాస్టార్‌గా చెర్రీ నటిస్తారని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. కాగా.. చిరు సరసన త్రిష రెండోసారి నటిస్తోంది.

Sponsored links

Chiranjeevi’s Leaked Look from Acharya:

Chiranjeevi’s Look from Acharya Leaked

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019