తన తదుపరి 2 చిత్రాలను ప్రకటించిన తేజ!

Sat 22nd Feb 2020 10:55 PM
alimelu manga venkata ramana,rakshasa raju ravanasurudu,director tej,birthday  తన తదుపరి 2 చిత్రాలను ప్రకటించిన తేజ!
Director Teja Announces Heroes And Titles Of His Next Two Films తన తదుపరి 2 చిత్రాలను ప్రకటించిన తేజ!
Sponsored links

రెండు కొత్త సినిమాల టైటిళ్లనూ, హీరోలనూ ప్రకటించిన డైరెక్టర్ తేజ

దర్శకుడు తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు.

ఈ సినిమాల కోసం ఆయన ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు.

ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. ‘జయం’ చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో రానాకు మరపురాని హిట్‌ను అందించిన విషయం గమనార్హం.

Sponsored links

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films:

Director Teja Birthday special: Two Movies Announced

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019