అనసూయ ‘బుట్టబొమ్మ’ డ్యాన్స్‌లో కేకో కేక!!

Fri 21st Feb 2020 03:42 PM
anasuya,buttabomma,local gangs,jany master  అనసూయ ‘బుట్టబొమ్మ’ డ్యాన్స్‌లో కేకో కేక!!
Anasuya Latest Local Gangs Promo Creates Sensation అనసూయ ‘బుట్టబొమ్మ’ డ్యాన్స్‌లో కేకో కేక!!
Sponsored links

అనసూయ అందాలు ఎంత పొగిడినా తక్కువే అన్నట్టుగా రోజు రోజుకి ఇంకా చిన్న పిల్లలా మారిపోతుంది. జబర్దస్త్ స్టేజ్ మీద ఇరగదీస్తున్న అనసూయ లోకల్ గ్యాంగ్స్ స్టేజ్ మీదయితే మరింతగా రెచ్చిపోతుంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లతో మార్చి మార్చి వేస్తున్న డాన్స్ స్టెప్స్ తో అనసూయ హీరోయిన్స్ కన్నా చాలా బెటర్ అనే ఫీల్ తెప్పిస్తుంది. హాట్ హాట్ అందాలతో వెరైటీ చీర కట్టుతో అనసూయ లోకల్ గ్యాంగ్స్ స్టేజ్ ని ఓ ఊపు ఊపుతుంది. అయితే ఈమధ్యన అనసూయ జబర్దస్త్ ని వదిలిపెడుతుంది అని, మల్లెమాల వారు అనసూయని బయటికి పంపడానికి రంగం సిద్ధం చేసారని ప్రచారం జరిగింది. అనసూయ జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్ కి జడ్జ్ గా వెళ్ళింది అనే కారణంతో అనసూయని మల్లెమాల తప్పిస్తున్నట్టుగా అన్నారు. కానీ అనసూయ మాత్రం దీనిపై స్పందించకపోయేసరికి అది గాసిప్ లిస్ట్ లోకి చేరింది.

ఇక విషయంలోకి వెళితే అనసూయ లోకల్ గ్యాంగ్స్ స్టేజ్ మీద ఎప్పటిలాగే జానీ మాస్టర్ తో కలిసి ఇరగదీసింది. తాజా మ్యూజికల్ హిట్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ సాంగ్ బుట్టబొమ్మ బుట్టబొమ్మ సాంగ్ కి జానీ మాస్టర్, అనసూయ అదిరిపోయే స్టెప్స్ వేశారు. జానీ మాస్టర్ ఏకంగా అల్లు అర్జున్ డ్రెస్ లాంటి డ్రెస్ తో రాగా, అనసూయ వెరైటీ చీర కట్టులో వచ్చి స్టేజ్ మీద బుట్టబొమ్మ సాంగ్ కి దుమ్ములేపే డాన్స్ స్టెప్స్ వేశారు. అనసూయ పూజా హెగ్డేలా ఫ్రాక్ ఒక్కటే వేయలేదు కానీ పూజా లాగే డాన్స్ ఇరగదీసింది. మరి లేటెస్ట్ గా వదిలిన లోకల్ గ్యాంగ్స్ ప్రోమోలో అనసూయ బుట్టబొమ్మ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అనసూయ అందాలకు తోడుగా ప్రదీప్, రవి చేసిన అల్లరి కమెడియన్స్ చేసే కామెడీతో లోకల్ గ్యాంగ్స్ ప్రోమో అదిరి పోయింది.

Sponsored links

Anasuya Latest Local Gangs Promo Creates Sensation:

Anasuya Buttabomma dance for Local Gangs

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019