గ్రాండ్‌గా ‘రాహు’ మ్యూజికల్ సెలబ్రేషన్స్

Wed 19th Feb 2020 12:42 PM
raahu movie,music,success,celebration,event,highlights  గ్రాండ్‌గా ‘రాహు’ మ్యూజికల్ సెలబ్రేషన్స్
Raahu Movie Music Success Celebrations Event Highlights గ్రాండ్‌గా ‘రాహు’ మ్యూజికల్ సెలబ్రేషన్స్
Sponsored links

గ్రాండ్ గా రాహు మ్యూజికల్ సెలెబ్రేషన్స్, ఫిబ్రవరి 28న రాహు విడుదల !!!

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న రాహు ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు, చిత్ర యూనిట్ తో పాటు జీవిత రాజశేఖర్ నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డైరెక్టర్ సుబ్బు వేదుల మాట్లాడుతూ...

అందరికి నమస్కారం, ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరో రెండు పాటలు విడుదల కానున్నాయి. మంచి సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న మా రాహు మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ...

రాహు మ్యూజిక్ సక్సెస్ మీట్ కు రావడం సంతోషంగా ఉంది. చిన్న సినిమా మ్యూజిక్ సక్సెస్ అవ్వడం అరుదుగా చూస్తూ ఉంటాము. ఏమో ఏమో... క్షణమ సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. జి తెలుగు వారు ఈ చిత్ర శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్  తీసుకోవడంతో ఈ సినిమా సక్సెస్ మొదలైంది అనిపిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ నుండి సురేష్ బాబు గారు విడుదల చేయడం ఇలా అన్ని పాజిటీవ్ థింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి 28న విడుదల కానున్న ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని తెలిపారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ...

థ్రిల్లర్స్ బాగా ఆడుతున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో విడుదల కానున్న రాహు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న. యంగ్ టీమ్ అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను అలరించాలని కోరుకుంటూ యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

హీరోయిన్ కృతి గర్గ్ మాట్లాడుతూ....

రాహు సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసి ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు గారికి ధన్యవాదాలు. మా సినిమా సాంగ్స్, ట్రైలర్స్ కు బయట మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఒక మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 28 న విడుదల కానున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన ప్రవీణ్ లక్కరాజు గారికి థాంక్స్, సాంగ్స్ వల్ల ఆడియన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యిందని తెలిపారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ...

మధుర శ్రీధర్ గారి వల్ల రాహు సినిమా మ్యూజికల్ సక్సెస్ మీట్ కు రావడం జరిగింది. శ్రీధర్ గారు ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. రాహు సినిమా ప్రోమోస్ చూశాను ప్రామిసింగ్ గా ఉన్నాయి. రాహు టైటిల్ ఆలోచింపచేసే విధంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తోన్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ సుబ్బు గారికి చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత స్వామి మాట్లాడుతూ...

అంతా కొత్తవారితో తీసిన సినిమా రాహు. అందరి సహకారంతో ఈ సినిమాను పూర్తి చేశాము. సినిమా నిర్మాణంలో మూడు మెట్లు  ఉంటాయి ఒకటి కథ ఎంచుకోవడం, రెండు సినిమా చేయడం మూడు పబ్లిసిటీ నాలుగు సినిమా విజయం. మూడు మెట్లు విజయవంతంగా పూర్తి చేసాము. నాలుగో మెట్టు మీద ప్రేక్షకులు నిలబెడతారని నమ్ముతున్నాం.

ఫిబ్రవరి 28న వస్తోన్న మా సినిమా సక్సెస్ అయ్యి మళ్ళీ ఇలా మీ అందరిని కలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

హీరో అభిరామ్ మాట్లాడుతూ...

రాహు నా మొదటి సినిమా ఈ చిత్ర ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మా సినిమాను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సుబ్బు గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు పని చెందిన అందరూ టెక్నీషియన్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను. ఫిబ్రవరి 28న విడుదల కానున్న రాహు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఆశిస్తున్నాను అన్నారు.

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.

టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి

రచన, దర్శకత్వం - సుబ్బు వేదుల

నిర్మాతలు - ఏ వి

ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల

డిఓపి - సురేష్ రగుతు ,ఈశ్వర్ యల్లు మహాంతి

మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు

ఎడిటింగ్ - అమర్ రెడ్డి

పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా

Sponsored links

Raahu Movie Music Success Celebrations Event Highlights:

Celebrities Speech at Raahu Movie Music Success Celebrations Event

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019