ఏంటి రాజా.. పవర్‌ స్టార్‌నే టార్గెట్ చేస్తున్నావ్!

Tue 18th Feb 2020 02:30 PM
pasupuleti ramarao,shivaji raja,targets,pawan kalyan,mega fans  ఏంటి రాజా.. పవర్‌ స్టార్‌నే టార్గెట్ చేస్తున్నావ్!
Shivaji Raja Targets Pawan.. What Happend! ఏంటి రాజా.. పవర్‌ స్టార్‌నే టార్గెట్ చేస్తున్నావ్!
Sponsored links

మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఓ గుర్తింపు, గౌరవం ఉంది.. అది మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిందే. అలా చిరు తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని రాణిస్తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి డజనుగా పైగా హీరోలు వచ్చేస్తుండటంతో మిగిలిన కుటుంబాలకు.. సినీ ప్రియులకు కాస్త అసూయ అనేది ఉంటుంది కామనే.!. కానీ కొందరైతే మరీ ఇండైరెక్టుగా టార్గెట్ చేసి మరీ నోటికొచ్చినట్లుగా మాట్లాడేసి మెగాభిమానుల నుంచి అక్షింతలు వేయించుకుంటున్నారు. ఇంతకీ అలా టార్గెట్ చేసిందెవరు..? పవన్ ఏమన్నారు..? ఆయన ఏమన్నాడు..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రముఖ సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఇటీవల తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌, పవన్, నితిన్‌తో పాటు పలువురు నటీనటులు ఆయన మరణంపై ప్రగాఢ సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అయితే పవన్‌ను మాత్రం సీనియర్ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా టార్గెట్ చేసి మాట్లాడారు.. మొదట ఎవరూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ.. అసలు ఆ వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి అన్నారనేదాన్ని కాస్త లోతుగా వెళ్లి ఆలోచించగా అది పవన్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాటలని తేలడంతో.. రాజాను మెగాభిమానులు ఓ ఆటాడుకుంటున్నారు. 

ఇంతకీ పవన్ ఏమన్నాడు!?

‘సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ పసుపులేటి రామారావు గారు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా వారితో నాచిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన శ్రీ రామారావు గారు మృదు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తన వంతు పాత్రను పోషించారు. శ్రీ రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ ఓ ప్రకటనలో తెలిపాడు.

శివాజీ రాజా ఏమన్నాడు!?

‘నిన్న, నేడు నేను పేపర్లో కొన్ని వార్తలు చదివాను. వాటిలో రామారావుగారికి సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు ఉన్నారు. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఓ హీరో రామారావు తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్నాడు. మరి ఆ హీరో రామారావు గారు బతికున్నప్పుడు ఆయనకేం చేసారో తెలీదు. చనిపోయాక ఆ హీరో ఎందుకు వచ్చి కనపడలేదో తెలీదు. చనిపోయాక కొన్ని పదాలు చాలా మంది సాధారణంగా వాడేస్తుంటారు. ఆయన లేని లోటు తీర్చలేనిది, ఆయనకు సంతాపం తెలియజేస్తున్నాం.. ఇలాంటి పదాలు వాడేస్తుంటారు’ అని శివాజీ రాజా అన్నాడు.

గట్టిగానే అక్షింతలు!

అయితే.. ఈ మాటలు పవన్‌ను ఉద్దేశించి అన్నవా..? లేకుంటే ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ను ఉద్దేశించి అన్నవో లేకుంటే యాంగ్రీస్టార్ రాజశేఖర్‌ను ఉద్దేశించి అన్నవో అర్థం కావట్లేదు కానీ.. మెగాభిమానులు మాత్రం ఆయన అన్నది తమ హీరోనే అంటూ తిట్టిపోసేస్తున్నారు.. ‘ఏంటి శివాజీ రాజా పవర్ స్టార్‌నే టార్గెట్ చేస్తావా’ తమరు పాతరోజులు మరిచిపోయినట్లున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. శివాజీ ఎవర్ని ఉద్దేశించి అన్నారో ఏంటో గానీ.. మెగాభిమానుల నుంచి గట్టిగానే అక్షింతలు పడుతున్నాయ్..!

Sponsored links

Shivaji Raja Targets Pawan.. What Happend!:

Shivaji Raja Targets Pawan.. What Happend!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019