విజయ్‌తో యాంటీ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారుగా!

Mon 17th Feb 2020 09:53 PM
vijay deverakonda,anty fans,trolling,social media  విజయ్‌తో యాంటీ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారుగా!
Anty Fans Trolling on Vijay Deverakonda విజయ్‌తో యాంటీ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారుగా!
Sponsored links

విజయ్ దేవరకొండకి రెండో సినిమాకే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. క్రేజ్ తో పాటుగా విజయ్ కి యాటిట్యూడ్ కూడా ఎక్కువైంది. తనకి రౌడీ ఫ్యాన్స్ ఉన్నారనే ధీమాతో స్టేజ్ మీద కాస్త ఎక్కువే మాట్లాడేవాడు. విజయ్ కి క్రేజ్ తో పాటుగా ఎంతమంది ఫ్యాన్స్ పుట్టారో.. అంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా తయారయ్యారు. ఆ యాంటీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండని సోషల్ మీడియాలో నెగెటివ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ అప్పుడే విజయ్ దేవరకొండ చేసిన ఓవరాక్షన్ తో విజయ్ యాంటీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయ్యాడు. అయినా వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు తగ్గాల్సిన విజయ్ అప్పుడూ రెచ్చిపోయాడు.

డియర్ కామ్రేడ్ కాస్త బావున్నప్పటికీ సినిమాని ట్రోల్స్ చేస్తూ సినిమాపై నెగెటివిటీ ప్రచారం చెయ్యడంతో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళింది. దాంతో యాంటీ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో యాంటీ ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ అడ్డంగా దొరికాడు. సినిమాకి క్రేజ్ లేకపోయినా విజయ్ కోసం శుక్రవారం మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోస్ ఫుల్ అయ్యాయి. కానీ సినిమాకొచ్చిన నెగెటివ్ టాక్ తో ఈవెనింగ్ షోస్ ఖాళీగా కనిపించాయి. సోషల్ మీడియాలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయి వరల్డ్ ఫేమస్ లవర్ ని చంపేశారు. చచ్చిన సినిమాని ఎవరు బ్రతికించినా బ్రతకదు అన్నట్టుగా వరల్డ్ ఫేమస్ లవర్ శనివారం కూడా బాగా డల్ అయ్యింది. విజయ్ క్రేజ్ కూడా సినిమాని కాపాడలేదని అర్ధమైంది. మరి భారీ టార్గెట్ల‌తో బ‌రిలోకి దిగిన ఈ సినిమాకు వీకెండ్లో కలెక్షన్స్ ఉసూరుమనిపించేలా ఉంది. వీకెండ్ ఇలా ఉంటే వీక్ డేస్ లో వరల్డ్ ఫేమస్ లవర్ ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌ని లేదు.

Sponsored links

Anty Fans Trolling on Vijay Deverakonda:

One More Flop in Vijay Deverakonda list

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019