‘రావ‌ణ‌ లంక‌’కి ఇంకా ఒక్క పాటే మిగిలుంది

Mon 17th Feb 2020 12:03 AM
ravana lanka,shooting update,devgil,murali sharma,bns raju  ‘రావ‌ణ‌ లంక‌’కి ఇంకా ఒక్క పాటే మిగిలుంది
Ravana Lanka Movie Shooting Update ‘రావ‌ణ‌ లంక‌’కి ఇంకా ఒక్క పాటే మిగిలుంది
Sponsored links

ఒక సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న కె సీరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ వారి ‘రావ‌ణ‌ లంక‌’

ఒక సినిమాని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కుల నానుడిగా వుండే టైటిల్స్ ఎప్పుడూ ఇట్టే ఆక‌ట్టుకుంటాయి. కె సీరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ లో క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో ముర‌ళీ శ‌ర్మ‌, దేవ్‌గిల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో బి.ఎన్‌.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రానికి టైటిల్‌గా ‘రావ‌ణ లంక’ అని ఖ‌రారు చేశారు. క్యాచీగా వుండే ఈ టైటిల్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రంలో క్రిష్‌, అష్మిత‌, త్రిషలు జంట‌గా న‌టించారు. స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఒక సాంగ్ మిన‌హా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం యొక్క మొద‌టి లుక్‌ని మ‌రియు మోష‌న్ పోస్ట‌ర్‌ని ఈ రోజు(ఆదివారం) విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు బి.ఎన్‌.ఎస్. రాజు మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల త‌రువాత తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా మా రావ‌ణ లంక చిత్రం రానుంద‌ని గ‌ర్వంగా చెప్తున్నాను. ఇలాంటి చిత్రాలకి స్క్రీన్‌ప్లే మెయిన్ పార్ట్‌గా వుంటాయి. మా చిత్రంలో కూడా ప్ర‌తి ఒక్క‌రూ త‌ల తిప్ప‌కుండా చూసేలా స్కీన్‌ప్లే కుదరింది. ముర‌ళీశ‌ర్మ గారు, దేవ్‌గిల్ గారు చాలా పెద్ద ఎస్సెట్ మాకు... అలాగే భ‌ద్రం, ర‌చ్చ‌ర‌వి కామెడీ టైమింగ్ కూడా స్క్రీన్ మీద న‌వ్వుకుంటారు. అలాగే కొత్త వారైనా క్రిష్ చాలా బాగా చేశాడు. అష్మిత‌, త్రిష లు ఈ థ్రిల్లింగ్ మూవీకి గ్లామ‌ర్ అందించారు. ఉజ్జ‌ల్ అందించిన సంగీతానికి బిగ్‌బాస్ సీరీస్‌3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ మ‌రియు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి కుమారుడు కాల‌భైర‌వ వారి వాయిస్‌తో ఆడియోకి క్రేజ్ తీసుకువ‌చ్చారు. అతి త్వ‌ర‌లో ఈ ఆడియోని విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఆక‌ట్ట‌ుకుంటుంది. అలాగే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేస్తాము..’’ అని అన్నారు.

 

క్రిష్‌, సందీప్‌, అష్మిత‌, త్రిష‌, ముర‌ళీ శ‌ర్మ‌, దేవ్‌గిల్‌, ర‌చ్చర‌వి, భ‌ద్రం త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

బ్యాన‌ర్‌.. కె సీరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ

స‌మ‌ర్ప‌ణ‌.. క్రిష్

మ్యూజిక్‌.. ఉజ్జ‌ల్‌

కెమెరా.. హ‌జ‌ర‌త‌య్‌(వ‌లి)

స్టంట్స్‌.. నందు, మ‌ల్లేష్‌

సింగ‌ర్స్‌.. రాహుల్ సిప్లిగంజ్‌, కాల‌భైర‌వ

ఎడిట‌ర్‌.. హ‌రీష్‌

లిరిక్స్‌.. భాషాశ్రీ

స్టోరీ-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం... బి.ఎన్‌.ఎస్. రాజు

Sponsored links

Ravana Lanka Movie Shooting Update:

Only one song Balance to Ravana Lanka Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019