ఈ సినిమా డిజాస్టర్ నే మించిపోయింది...

Sun 16th Feb 2020 09:55 AM
love aaj kal 2  ఈ సినిమా డిజాస్టర్ నే మించిపోయింది...
This movie become Disaster... ఈ సినిమా డిజాస్టర్ నే మించిపోయింది...
Sponsored links

బాలీవుడ్ లో లవ్ ఆజ్ కల్ 2 పేరుతో ఒక సినిమా విడుదలైంది. నిజ జీవితంలో ప్రేమికులైన ఆర్యన్ కార్తిక్, సారా ఆలీఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఆజ్ కల్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ కూడా ఎంత ఘోరంగా వచ్చిందంటే..సినిమా చూసిన వాళ్ళని ఎలా ఉందని అడిగితే దర్శకుడిని, హీరో హీరోయిన్లని తిట్టిపోస్తున్నారు.

 

ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినపుడే చాలా మంది సినిమా పోతుందని భావించారు. చాలా మంది సెలెబ్రిటీస్, క్రిటిక్స్ ఈ సినిమాని విడుదలకి ముందే చూశారు. అలా చూసిన వారిలో ఒక్కరు కూడా సినిమా బాగుందని చెప్పలేకపోయారు. కాగా చాలా మంది అసలేమీ బాగోలేదంటూ డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఇంత నెగెటివిటీ మధ్యలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులని కూడా ఆకట్టుకోలేక పోయింది.

 

ప్రేమికుల రోజున రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేమికులని ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అస్సలు పండలేదని అంటున్నారు. ఇంతియాజ్ ఆలీ గత సినిమాల్లో కనిపించిన ఫీల్ ఈ సినిమాలో మిస్ అయిందని చెప్తున్నారు. అయితే ఇంతియాజ్ ఆలీకి ఇది వరుసగా రెండో ఫెయిల్యూర్. మొత్తానికి బాలీవుడ్ బాక్సాఫీసు వేలంటైన్స్ డే రోజున పెద్ద డిజాస్టర్ పడింది.

Sponsored links

This movie become Disaster... :

Love aaj kal 2 become biggest disaster of the year 

Tags:   LOVE AAJ KAL 2

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019