మెహ్రీన్ వదిలిన ‘15-18-24 లవ్ స్టోరీ’ లుక్

Sun 16th Feb 2020 12:16 PM
mehreen,15 18 24 love story,first look,release  మెహ్రీన్ వదిలిన ‘15-18-24 లవ్ స్టోరీ’ లుక్
Mehreen Launches 15-18-24 Love Story First Look మెహ్రీన్ వదిలిన ‘15-18-24 లవ్ స్టోరీ’ లుక్
Sponsored links

వేలంటైన్స్ డే సందర్భంగా ‘15-18-24 లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన  మెహ్రీన్ పిర్జాదా.

వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘15-18-24లవ్ స్టోరీ’. మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్ దేవాదుల‌(బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.  ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా  విడుదల చేసి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. అలాగే టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈసందర్భంగా దర్శకుడు మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ - ‘‘లేటెస్ట్‌గా ఎఫ్‌2, అశ్వథ్ధామ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రిన్ మా చిత్రం ఫస్ట్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా యూనిట్ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. కథానుగుణంగా కులుంమనాలి, గోవా, ఒంగోలు, కేర‌ళ‌, హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని ప‌లు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. వైవిధ్యమైన కథా కథనాలతో సాగే ఈ చిత్రానికి ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవ‌ల‌ ఈ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

నిఖిల్ (బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి 

సహనిర్మాతలు: బి వి శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్, నిర్మాతలు: స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్, దర్శకత్వం:మాడుపూరి కిరణ్ కుమార్.

Sponsored links

Mehreen Launches 15-18-24 Love Story First Look:

15-18-24 Love Story First Look Released  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019