చిరు సినిమాలో కలెక్షన్ కింగ్.. నో..నో!

Fri 14th Feb 2020 11:21 PM
chiru-koratalava movie,mohan babu,megastar chiranjeevi,koratala shivea  చిరు సినిమాలో కలెక్షన్ కింగ్.. నో..నో!
Chiru-Koratalava Movie..: Unit Gives Clarity Over Mohan Babu Role! చిరు సినిమాలో కలెక్షన్ కింగ్.. నో..నో!
Sponsored links

మెగాస్టార్ చిరు - కొరటాల మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగగా.. ప్రస్తుతం చిరు పై కొన్ని సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు కొరటాల. అయితే ఈ సినిమాలో చిరంజీవికి విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నాడు అంటూ ఓ న్యూస్ గత మా డైరీ ఆవిష్కరణ ఈవెంట్ అప్పటినుండి ప్రచారంలో ఉంది. మోహన్ బాబు ని చిరు హగ్ చేసుకోవడంతో మొదలైన ఈ న్యూస్ .. చిరు - మోహన్ బాబు లు కలిపి ఓ ఫ్యాన్ మెడ్ పోస్టర్ తోనే ఈ న్యూస్ ని మెగా ఫాన్స్ కన్ఫర్మ్ చేసేసారు. అయితే నిజంగానే కొరటాల - చిరు సినిమాలో మోహన్ బాబు ఉన్నాడని అనుకున్నారు. అంతలా ఈ న్యూస్ పాపులర్ అయ్యింది కూడా. అందులో గతంలో చిరు సూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో మోహన్ బాబు విలన్ గా నటించడంతో.. ఈ న్యూస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ బాబు ఈ సినిమాలో నటించడం లేదని.. చిరు మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్తలు అవాస్తవం అని చెప్పారు. ఆయనకు తగ్గ క్యారెక్టర్ మా సినిమాలో లేదని చెబుతున్నారు. ఒకవేళ మోహన్ బాబు క్రేజ్, స్టామినాకు తగ్గ పాత్ర ఉంటే తప్పక సంప్రదించే వాళ్లం అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి దీనితో మోహన్ బాబు చిరు సినిమాలో విలన్ పాత్రపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్  కాస్త ఫీలవుతున్నారు. ఎందుకంటే మోహన్ బాబు నటిస్తే చిరు మూవీకి బాగా క్రేజ్ వచ్చేదని.. అలాంటి సూర్ హిట్ కాంబో చిరు - మోహన్ బాబుది అంటూ ఫీలవుతున్నారు

Sponsored links

Chiru-Koratalava Movie..: Unit Gives Clarity Over Mohan Babu Role!:

Chiru-Koratalava Movie..: Unit Gives Clarity Over Mohan Babu Role!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019