ఇక నుండి గోవాలో షూటింగ్ అంత ఈజీ కాదట

Thu 13th Feb 2020 06:14 PM
goa  ఇక నుండి గోవాలో షూటింగ్ అంత ఈజీ కాదట
Goa govt putting restrictions to shoot a movie ఇక నుండి గోవాలో షూటింగ్ అంత ఈజీ కాదట
Sponsored links

సినిమాల్లో బీచ్ పాటలకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ తీయాలనుకుంటే ఖచ్చితంగా బీచ్ నే ప్రిఫర్ చేస్తారు. మన దగ్గర బీచ్ ల గురించి మాట్లాడుకుంటే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క ప్లేస్ గోవా... గోవాలో ఎన్ని బీచ్ లు ఉన్నాయన్నది పక్కన పెడితే సినిమాల్లో గోవాని ఎన్ని సార్లు చూపించారో లెక్కే లేదు. అక్కడ చాలా విరివిగా సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. 

 

కేవలం బీచ్ లే కాదు..అక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటుంది. అయితే సినిమాల్లో ప్రకృతి గురించి చూపించేవాళ్ళు చాలా తక్కువ. గోవా అనగానే డైరెక్ట్ గా సముద్రం.. బీచ్ దగ్గరికే వచ్చేస్తారు. ఇప్పటి వరకు గోవాలో ఎన్నో షూటింగ్ లు చాలా స్వేఛ్ఛగా జరిగాయి. కానీ ఇకముందు అలా ఉండదట. ఎందుకంటే గోవాని సినిమాల్లో చూపించేటపుడు కేవలం డ్రగ్స్, సెక్స్ రాకెట్ కి అడ్డాలాగా మాత్రమే చూపెడుతున్నారట. దానివల్ల గోవాకి చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశ్యంతో గోవాలో షూటింగ్ చేయాలంటే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారట.

 

అయితే ఇలా పెట్టడానికి కారణం బాలీవుడ్ లో వచ్చిన మలంగ్ అనే సినిమానే కారణం అని అంటున్నారు.  ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో గోవా డ్రగ్స్ కి అడ్డా అన్నట్లుగా చూపించడం జరిగింది. దీనితో గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇకనుండి గోవాలో షూటింగ్ చేయాలంటే స్క్రిప్ట్ లో గోవా గురించి ఎలా చూపించబోతున్నారో తెలుసుకున్నాకే అనుమతి ఇస్తారట.

Sponsored links

Goa govt putting restrictions to shoot a movie:

goa restricted to shoot a movie 

Tags:   GOA

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019