నిబద్ధతకు మారుపేరు పసుపులేటి : కృష్ణంరాజు

Rebal Star Krishnam Raju On Pasupuleti Ramarao Death

Thu 13th Feb 2020 06:38 PM
rebal star,krishnam raju,pasupuleti ramarao,pasupuleti death  నిబద్ధతకు మారుపేరు పసుపులేటి : కృష్ణంరాజు
Rebal Star Krishnam Raju On Pasupuleti Ramarao Death నిబద్ధతకు మారుపేరు పసుపులేటి : కృష్ణంరాజు
Advertisement

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆకస్మిక మరణం పట్ల రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. పసుపులేటి రామారావుతో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నిబద్ధతకు మారుపేరైన పసుపులేటి రామారావు నాకు ఎంతో సన్నిహితుడు. మా గోపీకృష్ణ మూవీస్ ప్రారంభం నుంచి నాతోను, మా సంస్థతోనూ ఆయనకు చక్కని అనుబంధం ఏర్పడింది. నలభై ఐదు సంవత్సరాలుగా సినిమా జర్నలిస్టుగా మా అందరికీ సుపరిచితులైన రామారావు మరణం వ్యక్తిగతంగా నన్నే కాకుండా యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నిజాయితీ, నిరాడంబరత, కష్టపడి పని చేసే తత్వంతో పరిశ్రమలో అందరికీ ఆప్తుడు అయ్యాడు రామారావు. ఎప్పుడూ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, భుజాన సంచి.. ఇదీ రామారావు శాశ్విత ఆహార్యం. తను కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తెలుసుగాని ఇంత హఠాత్తుగా ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. రామారావు మరణంతో తెలుగు ఫిలిం జర్నలిజంలో ఒక తరం అంతరించినట్లుయ్యింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి, తెలుగు సినీ పాత్రికేయ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఆయన ఆత్మకు శాంతిని ఆకాంక్షిస్తున్నాను’ అని రెబల్ స్టార్ అన్నారు

Rebal Star Krishnam Raju On Pasupuleti Ramarao Death:

Rebal Star Krishnam Raju On Pasupuleti Ramarao Death  


Loading..
Loading..
Loading..
advertisement