కరోనా: దండం పెట్టేసిన రాజశేఖర్!

Thu 13th Feb 2020 12:32 AM
angry star,rajasekhar,corona virus,doctors  కరోనా: దండం పెట్టేసిన రాజశేఖర్!
Angry Star Reacts Over Corona Virus.. !! కరోనా: దండం పెట్టేసిన రాజశేఖర్!
Sponsored links

‘కరోనా’.. ఇప్పుడు ఈ పేరు వింటేనే జనాలు వణికిపోతున్నారు. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ దేశాలను దాటుతుండటంతో ఎప్పుడు ఎటువైపు వచ్చి.. ఎవరికి సోకుతుందో అర్థం కాని పరిస్థితి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల జనాల్లో కొందరు ఈ దెబ్బతో చికెన్, మటన్ తినడం కూడా మానేసి.. బయట తిరగకుండానే ఇంటికే పరిమితం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు కరోనా వచ్చే అవకాశాలు అస్సలు లేవని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి జాప్యం లేకుండా విదేశాల నుంచి వస్తున్న డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తలు తీసుకుని టెస్ట్‌లు చేసి రాత్రింబగళ్లు విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కరోనా, డాక్టర్లు, నర్సుల గురించి టాలీవుడ్‌ సీనియర్ హీరో, యాంగ్రీస్టార్, వైసీపీ నేత రాజశేఖర్ స్పందించాడు. కాగా.. సినిమాల్లోకి రాకముందు రాజశేఖర్ కూడా డాక్టరేనన్న సంగతి తెలిసిందే. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. డాక్టర్లు, నర్సులకు దండం పెట్టేశారు. ‘మీరు చేస్తున్న సేవలకు చేతులెత్తి దండం పెట్టాలి. మీరు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాం. కరోనా వైరస్ సోకకుండా మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్‌పై ప్రతి దేశం పోరాడుతోంది. ముఖ్యంగా చైనా.. ఈ వైరస్‌ వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి. మేము మీతో ఉన్నాం.. మీకు అండగా ఉంటాం’ అని రాజశేఖర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఆయన చేసిన ట్వీట్‌‌కు నెటిజన్లు, పలువురు వైద్యులు కామెంట్లు చేస్తున్నారు.

Sponsored links

Angry Star Reacts Over Corona Virus.. !!:

Angry Star Reacts Over Corona Virus.. !!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019