రష్మిక మందన్నాను వదలనంటున్న డైరెక్టర్!

Thu 13th Feb 2020 12:19 AM
actress rashmika,rashmika mandanna,geetha govindam,naga chaitanya  రష్మిక మందన్నాను వదలనంటున్న డైరెక్టర్!
News About Top Actress Rashmika Mandanna! రష్మిక మందన్నాను వదలనంటున్న డైరెక్టర్!
Sponsored links

ఏదైనా ఒక సినిమాకు హీరోయిన్ సరిగ్గా సెట్ అయ్యి.. ఆ సినిమా హిట్టయితే మాత్రం ఇక డైరెక్టర్ ఆ బ్యూటీని అస్సలు వదలరు.. వదులుకునేందుకు సిద్ధపడరు కూడా. ఇలా ఫలానా డైరెక్టర్ సినిమా అంటే ఆయన హీరోయిన్ ఎవరనేది టక్కున చెప్పేయచ్చు. ఇది ఎప్పట్నుంచో టాలీవుడ్‌లో జరుగుతున్నవే. అయితే ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కూడా.. కుర్ర భామను అస్సలు వదిలేది లేదని.. ఆమెనే తన తదుపరి సినిమాకు తీసుకుంటున్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? ఆ భామనే ఎందుకు తీసుకుంటున్నాడు..? అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా నటీనటులుగా పరుశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ సినిమా గురించి ఇప్పటి యూత్‌కు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అటు విజయ్.. ఇటు రష్మిక నటించమంటే జీవించేశారంతే.. మరీ ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు ఊపిరికి నిలవడంతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత రష్మిక రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాతే బోలెడన్ని అవకాశాలు కూడా వచ్చాయ్. అయితే అచ్చొచ్చిన అందాల భామను తన తదుపరి సినిమాలో తీసుకోవాలని పరుశురామ్ ఫిక్స్ అయ్యాడట.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా పరుశురామ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు అయిపోగా.. ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. అయితే.. ఈ చిత్రంలో చైతూ సరసన రష్మిక నటిస్తోందన్న పుకారు టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. మొదట ఒకరిద్దర్ని అనుకున్నప్పటికీ డైరెక్టర్ మనసు మాత్రం రష్మిక పైనే ఉందట. ఒకసారి అడిగితే పోల అని ఆ అందాల భామను సంప్రదించగా.. రెడీ అన్నదట. ఎంతైనా తనకు బ్లాక్ బస్టర్ హిట్టిచ్చి, రేంజ్‌ను పెంచిన దర్శకుడు కదా ఆ మాత్రం టక్కున ఒప్పుకోకుంటే ఏ మార్యాద ఉంటదిలే. చైతూ-రష్మిక జోడీగా నిజంగానే నటిస్తారా..? లేకుంటే పుకార్లకే పరిమితం అవుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

News About Top Actress Rashmika Mandanna!:

News About Top Actress Rashmika Mandanna!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019