‘ఛలో’ డైరెక్టర్‌పై నాగశౌర్య ఫైర్..!

వెంకీ కుడుముల భీష్మ చిత్రం ఈ నెల 21 న విడుదలకు సిద్దమవుతుంది. నితిన్ - రష్మిక వెంకీ కుడుముల డైరెక్షన్ అతని స్వభావాన్ని, ఫ్రెండ్లీ నేచర్ ని తెగ పొగిడేస్తుంటే, వెంకీ కుడుముల ఫస్ట్ హీరో నాగ శౌర్య మాత్రం వెంకీ కుడుములని సోషల్ మీడియా వేదికగా మీడియా ముఖంగా కడిగి పారేస్తున్నాడు. భీష్మ విడుదల సమయంలో నాగ శౌర్య తనకి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల గురించి అలా మాట్లాడడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలోనే ఛలో సినిమా కథ తనదే అని చెప్పిన నాగ శౌర్య తాజాగా వెంకీ కుడుములను మరోసారి తన కాంపౌండ్ లో కాలు పెట్టనివ్వనని చెబుతున్నాడు.
వెంకీ కుడుముల ఛలో సినిమాకి ముందు తనతో నాలుగేళ్లు తిరిగాడని, త్రివిక్రమ్ శిష్యుడు, అలాగే తనకి బాగా క్లోజ్ కాబట్టి ఓ కథని తయారు చేసి తనకి వినిపించగా ఆ కథ చాలా దరిద్రంగా ఉందని, అయితే వెంకీ కుడుములతో కలిసి ఛలో కథని రాశానని కానీ అప్పుడు ఛలో రైటర్ గా తన పేరు వాడుకోకుండా వెంకీకి లైఫ్ ఇవ్వాలని ఆ కథని కూడా తామే ఓన్ గా నిర్మించి ఛలో సినిమా చేశామని కానీ సినిమా విడుదలయ్యాక వెంకీ తన ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చెయ్యలేదని, అంతేకాకుండా తన తల్లి వెంకీ కుడుముల కార్ గిఫ్ట్ గా ఇస్తే అది కూడా వాడలేదని, అసలు వెంకీకి ఏమైందో తనకి తెలియదని, కాని ఈసారి వెంకీ మళ్ళీ తన దగ్గరకి వచ్చినా తాను మాత్రం రానివ్వనని చెప్పి షాకిచ్చాడు. మరి వెంకీ ఏం చేసాడో శౌర్యకి, వెంకీకే తెలియాలి. కానీ భీష్మ విడుదల సమయంలో శౌర్య ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం భీష్మ మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు.
Naga Shourya Shocking comments on Venky Kudumula
Naga Shourya Sensational Comments on Chalo Director







































