Advertisement

స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రలో పవన్!

Fri 31st Jan 2020 01:32 PM
pawan kalyan,pawan new movie,janasenani,syeera  స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రలో పవన్!
News About Pawan Kalyan Movie! స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రలో పవన్!
Advertisement

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడమే పింక్ రీమేక్ షూటింగ్ పరిగెత్తిస్తున్నాడు. దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ స్పీడు అందుకోవడానికి కష్ట పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడో గంతు అక్కడో గంతు వేస్తున్నాడు. అంటే రాజకీయాలు, సినిమాలు రెండు మ్యానేజ్ చెయ్యాలి గనక రెండిటిలో తన మార్క్ చూపెడుతున్నాడు. దిల్ రాజు పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ తో మరో సినిమాని పట్టాలెక్కించాడు. అసలు ఈ రేంజ్ లో పవన్ సినిమాలు చెయ్యడం ఇదే కొత్త. క్రిష్ సినిమాని మొదలెట్టాడు కానీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలోనే ఉంటుంది. ఈలోపు పింక్ రీమేక్ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు పవన్. పింక్ రీమేక్ కోసం పెద్దగా మేకోవర్ అవసరం లేదు గనక పవన్ రాజకీయాల లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు.

కానీ క్రిష్ సినిమాకి పవన్ లుక్ మార్చాల్సి ఉంటుంది. మరి క్రిష్ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళకుండానే పవన్ కళ్యాణ్ మరో సినిమాని లైన్ లో పెడుతున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా దర్శకనిర్మాత పేరు బయటికి రాకుండానే పవన్ కళ్యాణ్ ఫలానా సినిమా ఓకే చేస్తున్నాడని అంటున్నారు. చిరు ‘సైరా’ లాంటి ఓ స్వాతంత్య్ర సమరయోధుడు కథలో పవన్ నటించబోతున్నాడని.. అది కూడా పండగసాయన్న అనే స్వాతంత్య్ర సమరయోధుడు పాత్రకి పవన్ పోషించబోతున్నట్లుగా సమాచారం. పండగసాయన్న జీవిత కథలో పవన్ ఓ కీ రోల్ పోషించబోతున్నాడని సోషల్ మీడియా టాక్. మరి ఈ రేంజ్ స్పీడు ని పవన్ నుండి ఊహించ లేదు. పింక్ రీమేక్, క్రిష్ సినిమా తర్వాత ఈ మూడో సినిమా ముచ్చట్లు మొదలుకాబోతాయని తెలుస్తుంది.

News About Pawan Kalyan Movie!:

News About Pawan Kalyan Movie!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement