బాలయ్య-బోయపాటి మూవీలో అచ్చ తెలుగు బ్యూటీ!

Telugu Beauty to pair with Balayya-Boyapati movie!!

Thu 30th Jan 2020 01:13 PM
telugu beauty,anjali,actress anjali,balayya-boyapati movie  బాలయ్య-బోయపాటి మూవీలో అచ్చ తెలుగు బ్యూటీ!
Telugu Beauty to pair with Balayya-Boyapati movie!! బాలయ్య-బోయపాటి మూవీలో అచ్చ తెలుగు బ్యూటీ!
Advertisement

టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే బోయపాటి శ్రీను.. ‘సింహా’,‘లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణతో మూడో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ హ్యాట్రిక్‌ చిత్రంకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయ్. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ మొదలుకాలేదు. ఇదిలా ఉంటే.. బాలయ్య సరసన ఎవరు నటిస్తారనే విషయం మాత్రం తెలియరాలేదు. బాలయ్యతో రొమాన్స్ చేసేదెవరు..? బాలయ్యను ఢీకొట్టేదెవరు..? ఎవరెవరు ఈ సినిమాలో నటిస్తారనే దానిపై మాత్రం చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు.. త్రిష, శ్రియ, అనుష్క, నయనతార ఇలా చాలా పేర్లే తెరపైకి వచ్చాయి. అంతేకాదు.. వేదిక, సోనాల్ చౌహన్‌, కీర్తి సురేష్, ఆఖరికి కేథరిన్‌.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు కూడా వినపడింది. ఆ తర్వాత సోనాక్షి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవ్వడం జరిగింది.

అయితే.. తాజాగా అచ్చ తెలుగు హీరోయిన్ అంజలీని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అంటే అటు తిరిగి.. ఇటు తిరిగి ఆఖరికి మన తెలుగు హీరోయిన్‌నే బాలయ్య-బోయపాటి ఫిక్స్ చేశారట. బాలయ్య సరసన అనే సరికి అంజలి ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ చేయాలని బోయపాటి భావిస్తున్నారట.

కాగా.. బోయపాటి-బాలయ్య సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంజలి హీరోయిన్‌గా తీసుకున్నారన్నదైనా పక్కానా లేకుంటే ఇదికూడా రూమర్‌గానే మిగిలిపోతుందో.. వేచి చూడాల్సిందే. అంజలి నటన గురించి ప్రత్యేకించేమీ చెప్పాల్సిన అక్కర్లేదు.. ఇటు తెలుగులోను.. అటు తమిళంలోను నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఇదివరకే బాలయ్య సరసన ‘డిక్టేటర్’లో అంజలి నటించి మెప్పించింది. తాజా రూమర్ నిజమైతే బాలయ్య సరసన అంజలి రెండోసారి నటిస్తుందన్న మాట.

Telugu Beauty to pair with Balayya-Boyapati movie!!:

Telugu Beauty to pair with Balayya-Boyapati movie!!  


Loading..
Loading..
Loading..
advertisement