పవన్-క్రిష్ మూవీ.. వాటి కోసం 20 కోట్లా?

Thu 30th Jan 2020 11:25 AM
pawan kalyan,krish,movie,latest,update  పవన్-క్రిష్ మూవీ.. వాటి కోసం 20 కోట్లా?
20 Crores for Pawan Kalyan and Krish Film Sets పవన్-క్రిష్ మూవీ.. వాటి కోసం 20 కోట్లా?
Sponsored links

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే తరువాయి.. పింక్ రీమేక్ షూటింగ్ చకచకా చేస్తున్నాడు. మరోపక్క క్రిష్ తో కలిసి మరోకొత్త సినిమా సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ఈరోజు జనవరి 29 నుండి క్రిష్ - పవన్ కొత్త చిత్రం సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలయింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఫిబ్రవరి 4 నుండి మొదలుకాబోతుంది. అయితే క్రిష్ తో పవన్ చేసే సినిమా భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కనుందని,  మొగ‌లాయిల పరిపాల‌నా కాలం నాటి కథ కావడంతో ఆ కాలానికి సంబందించిన వాతావరణం సృష్టించడానికి చాలానే ఖర్చు పెడుతున్నారట.

అందులో ముఖ్యంగా తాజ్ మ‌హ‌ల్‌, చార్మినార్ సెట్లు ఈ సినిమాలో కీలకం కానున్నాయని.. ఇక సెట్స్ కోసమే భారీ బడ్జెట్ అంటే అదనంగా 20 కోట్లు పెట్టబోతున్నారట. 20 కోట్లతో అద్భుతంగా కొన్ని సెట్స్ ని ఆర్ట్ నిపుణులు తీర్చిదిద్దబోతున్నారట.  మ‌హ‌మ్మ‌దీయుల క‌ట్ట‌డాల‌న్నీ సెట్స్ రూపంలో దాదాపుగా తెర‌పై చూపించ‌బోతున్నార‌ని అంటున్నారు. ఇక పవన్ - క్రిష్ ఫస్ట్ షెడ్యూల్ మాత్రం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో స్పెషల్ గా వేసిన సెట్ లో జ‌ర‌గ‌బోతోంది అని చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి నటించబోతున్నాడట.

Sponsored links

20 Crores for Pawan Kalyan and Krish Film Sets:

Pawan Kalyan and Krish Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019