పూజా హెగ్డే ఆ హీరోకి ఎందుకు సారీ చెప్పింది?

Pooja Hegde Says Sorry to That Hero

Wed 29th Jan 2020 10:32 PM
pooja hegde,sorry,ranbir kapoor,bollywood,movies  పూజా హెగ్డే ఆ హీరోకి ఎందుకు సారీ చెప్పింది?
Pooja Hegde Says Sorry to That Hero పూజా హెగ్డే ఆ హీరోకి ఎందుకు సారీ చెప్పింది?
Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. గత ఏడాది అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 4 లో నటించిన పూజా హెగ్డేకి మరోసారి అక్షయ్ కుమార్ ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ బాలీవుడ్ సర్కిల్స్ లో నడుస్తుంది. ఇకపోతే పూజా హెగ్డే కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఆమె తప్పులే చెయ్యదు అనుకుంటే పొరబాటే. అదేమిటంటే పూజా హెగ్డే బాలీవుడ్ టాప్ హీరోకి చాలాసార్లు క్షమాపణలు చెప్పిందట. ఎందుకంటే ఆ హీరోతో కలిసి పనిచేస్తున్నప్పుడు తాను జూనియర్ అంటే అప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టడంతో ఆ హీరోని చూసి భయపడి షూటింగ్ స్పాట్ లో టేక్స్ మీద టేక్స్ తీసుకుందట పూజా. అందుకే ఆ హీరోకి తెగ క్షమాపణ చెప్పిందట.

మరి ఆ హీరో ఎవరో కాదు ప్లే బాయ్ రణబీర్ కపూర్. తాను కెరీర్ స్టార్టింగ్ లో ఓ యాడ్ ఫిలింలో నటించేటప్పుడు అప్పటికే టాప్ హీరో అయిన రణబీర్ కపూర్ తో కలిసి పనిచేయాల్సి వచ్చిందట. అయితే టాప్ హీరో రణబీర్ కపూర్ ని చూసి కాస్త కంగారు పడి తాను చెయ్యాల్సిన సీన్ తాలూకు సన్నివేశాల కోసం టేక్స్ మీద టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట. దానితో రణబీర్ కపూర్ కి చాలాసార్లు క్షమాపణ చెప్పిందట. అయితే అన్నిసార్లు క్షమాపణ చెప్పడంతో రణబీర్ కపూర్ ఇన్నిసార్లు క్షమాపణ చెప్పకు నాకు ఇబ్బందిగా ఉంది అంటూ సున్నితంగా హెచ్చరించడంతో పూజా ఆ క్షమాపణల పర్వం ఆపేసి కూల్ గా షూటింగ్ చేసానని చెబుతుంది. రణబీర్ కపూర్ చాలా మంచోడని అప్పుడే ఫీల్డ్ లోకొచ్చిన వారిని ఎంకరేజ్ చేసే మనస్తత్వం రణబీర్ కపూర్‌దని చెబుతుంది. 

Pooja Hegde Says Sorry to That Hero:

Pooja Hegde Says So many sorries to Ranbir Kapoor


Loading..
Loading..
Loading..
advertisement