జూనియర్ ఎన్టీఆర్ సరసన మహేశ్ హీరోయిన్!?

Tue 28th Jan 2020 01:18 AM
jr ntr,romance,rashmika mandanna,mahesh heroine,ntr-trivikram  జూనియర్ ఎన్టీఆర్ సరసన మహేశ్ హీరోయిన్!?
Jr NTR to romance with Mahesh Babu heroine!! జూనియర్ ఎన్టీఆర్ సరసన మహేశ్ హీరోయిన్!?
Sponsored links

ఇదేంటి.. జూనియర్ ఎన్టీఆర్ సరసన సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోయినా..? అనుకుంటున్నారా..? అదేనండి ఈ మధ్య టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బిజీ స్టార్‌గా మారిపోయింది. వరుస సినిమాలు, స్టార్ హీరోల సరసన నటించి మెప్పించేస్తోంది. ఇటీవలే మహేశ్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించిన ఈ భామ.. ఘట్టమనేని ఫ్యాన్స్‌ను మైమరిపించింది. స్టార్ హీరోలతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు.. మరింత క్రేజ్ సంపాదించుకోవాలని ఈ భామ గట్టిగా అనుకుందట. అందుకే ఏ అవకాశం వచ్చినా సరే అస్సలు కాదనకుండా ఓకే చెప్పేస్తోందట.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. జూనియర్ నటిస్తున్న RRR చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు త్రివిక్రమ్ స్టోరీ లైన్ చెప్పడం.. జూనియర్ ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయట. అయితే ఇక మిగిలిందల్లా RRR షూటింగవ్వడం.. ఇక్కడ జాయిన్ అవ్వడమేనట. అందుకే.. మాటల మాంత్రికుడు హీరోయిన్ వేట మొదలుపెట్టగా.. ప్రస్తుతం మంచి క్రేజ్‌ మీదున్న రష్మికను ఫిక్సయ్యారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను హీరోగా పెట్టి తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో త్రివిక్రమ్ ఊపు మీదున్నారు. ఇదే ఊపులోనే మరో హిట్ కొట్టాలని ఆ హిట్ ఎన్టీఆర్‌తోనే అని తెలుస్తోంది.! మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

Sponsored links

Jr NTR to romance with Mahesh Babu heroine!!:

Jr NTR to romance with Mahesh Babu heroine!!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019