‘డిస్కోరాజా’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ అవుతుంది

Mon 27th Jan 2020 10:39 PM
disco raja,raviteja,box office,steady collections,vi anand  ‘డిస్కోరాజా’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ అవుతుంది
Disco Raja showing a steady rise ‘డిస్కోరాజా’ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ అవుతుంది
Sponsored links

డిస్కోరాజాకు పెరిగిన ఆదరణ, సక్సెస్ ఫుల్ గా అన్ని థియేటర్స్‌లో ప్రదర్షింపబడుతోన్న చిత్రం

మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మౌత్ టాక్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్ప‌వ‌చ్చు. తొలిరోజుతో ఈ వీకెండ్ మొత్తం థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. కొత్త సైన్స్ ఫిక్షన్ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌భాన‌టేష్‌, పాయ‌ల్‌ రాజ‌పుత్‌, తానియా, బాబిసింహా, సునీల్ త‌దిత‌రులు నటించారు. రామ్‌తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్స్ వచ్చినా సరే ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది, ముఖ్యంగా రోజురోజుకు జనాదరణ పొందుతూ డిస్కోరాజా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడని చిత్రయూనిట్ తెలుపుతుంది. ఆదివారం చిత్ర యూనిట్ థియేటర్స్ విజిట్ చేశారు, అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ లైవ్ లో చూసిన చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.

సడన్ గా చిత్ర కలెక్షన్స్ పెరగడంతో థియేటర్స్ పెరిగే అవకాశం కూడా ఉందని టాక్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కోరాజా రానున్న రోజుల్లో మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Sponsored links

Disco Raja showing a steady rise:

Disco Raja, starring Ravi Teja in the titular role hit the theaters on January 24th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019