Advertisement

త్రివిక్ర‌మ్‌ ఆవిష్క‌రించిన ‘ఓ పిట్టక‌థ‌’ పోస్ట‌ర్

Sun 26th Jan 2020 04:41 PM
trivikram srinivas,o pittakatha,movie,title,poster,launch  త్రివిక్ర‌మ్‌ ఆవిష్క‌రించిన ‘ఓ పిట్టక‌థ‌’ పోస్ట‌ర్
Trivikram Srinivas Launches O Pittakatha Movie Title Poster త్రివిక్ర‌మ్‌ ఆవిష్క‌రించిన ‘ఓ పిట్టక‌థ‌’ పోస్ట‌ర్
Advertisement

కొన్ని క‌థ‌లు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. అతి త‌క్కువ నిడివితో  పెద్ద పెద్ద విష‌యాల‌ను చెబుతుంటాయి. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టక‌థ‌లు అంటుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ పిట్టక‌థ‌ను సెల్యులాయిడ్ మీద చూపించ‌బోతోంది భ‌వ్య క్రియేష‌న్స్.  భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచే భ‌వ్య క్రియేష‌న్స్ తాజాగా తెర‌కెక్కించిన క్యూట్ క‌థకు ‘ఓ పిట్టక‌థ‌’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం టైటిల్ పోస్ట‌ర్ ని మాట‌ల మాంత్రికుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ విడుద‌ల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఓ పిట్టక‌థ‌’ గురించి త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాతో నాకు ఒక లింకు ఉంది. అదేంటంటే నాకు ఈ క‌థ తెలియ‌డ‌మే. క‌థ విన్న‌ప్పుడు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ ఉంటే బావుంటుంద‌నే డిస్క‌ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు, ద‌ర్శ‌కుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెప్పారు. అందులో ‘ఓ పిట్టక‌థ‌’ నాకు చాలా బాగా న‌చ్చింది ఈ టైటిల్‌.  ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అనే క్యాప్ష‌న్ పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చాను. అంత‌వ‌ర‌కే నా కంట్రిబ్యూష‌న్‌. క‌థ న‌చ్చింది. టైటిల్ బావుంది. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఈ టైటిల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ఒప్పుకున్నాను’’ అని చెప్పారు.

చిత్ర నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ... ‘‘మా సంస్థ‌లో అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ‘పైసా వ‌సూల్‌’, అంత‌కు ముందు టాప్ హీరో గోపీచంద్‌తో ‘శౌర్యం’, ‘లౌక్యం’,‘సౌఖ్యం’ త‌ర‌హా క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేశాం. ఓ వైపు భారీ బ‌డ్జెట్‌తో ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే, తేజ‌తో ‘నీకు నాకు డాష్ డాష్‌’ అని ఓ సినిమా చేసి కొత్త‌వారిని ప్రోత్స‌హించాం. అలా మ‌రోసారి కొత్త‌వాళ్ల‌తో సినిమా చేద్దామ‌నుకున్న‌ప్పుడు చెందు ముద్దు చెప్పిన ఓ చిన్న క‌థ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంట‌నే సెట్స్ మీద‌కు తీసుకెళ్లాం. ఆ క‌థే  మేం తెర‌కెక్కించిన ‘ఓ పిట్ట‌క‌థ‌’.  మా ‘ఓ పిట్టక‌థ‌’ చిత్రం పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మాట‌ల మాంత్రికుడు, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌ త్రివిక్ర‌మ్‌గారికి ధ‌న్య‌వాదాలు’’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే ర‌వి మాట్లాడుతూ... ‘‘ఓ వైపు కామెడీ, మ‌రోవైపు థ్రిల్లింగ్ అంశాల‌తో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంది మా ‘ఓ పిట్ట క‌థ‌’. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మార్చిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు చెందు ముద్దు మాట్లాడుతూ... ‘‘ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ ఇది. ప్ర‌తి స‌న్నివేశం స్వ‌చ్ఛంగా సాగుతుంది. ఓ వైపు క‌డుపుబ్బ న‌వ్విస్తూ ఉంటుంది. మ‌రోవైపు ఏం జ‌రుగుతోంద‌నే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆ థ్రిల్లింగ్ అలాగే స‌స్టైన్ అవుతుంది. ట్విస్టులు మ‌రింత థ్రిల్ క‌లిగిస్తుంటాయి. స్క్రీన్ ప్లే ప్ర‌ధానంగా తెర‌కెక్కించాం. మా క‌థ‌, టైటిల్ న‌చ్చింద‌ని చెప్పి, క్యాప్ష‌న్ పెట్టిన గురూజీ త్రివిక్ర‌మ్‌గారికి ధ‌న్య‌వాదాలు’’ అని అన్నారు.

న‌టీన‌టులు

విశ్వంత్ దుద్దుంపూడి, సంజ‌య్‌రావు, నిత్యాశెట్టి, బ్ర‌హ్మాజీ, బాల‌రాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి, భ‌ద్రాజీ, ర‌మ‌ణ చ‌ల్క‌ప‌ల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి పాట‌లు: శ‌్రీజో, ఆర్ట్ష్ట్:  వివేక్ అన్నామ‌లై,  ఎడిట‌ర్‌:  డి.వెంక‌ట‌ప్ర‌భు,  కెమెరా:  సునీల్ కుమార్ య‌న్‌., సంగీతం:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అన్నే ర‌వి, నిర్మాత‌:  వి.ఆనంద ప్ర‌సాద్‌. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  చెందు ముద్దు.

Trivikram Srinivas Launches O Pittakatha Movie Title Poster:

O Pittakatha Movie Title Poster Released

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement