పవన్ తేజ్ కొణిదెల చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

Sun 26th Jan 2020 02:18 AM
pawan tej konidela,ee kathalo patralu kalpitham,movie,first schedule,complete  పవన్ తేజ్ కొణిదెల చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!
Ee Kathalo Patralu Kalpitham Movie Shooting Update పవన్ తేజ్ కొణిదెల చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!
Sponsored links

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!!

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  ఈ సందర్భంగా..

నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ - ‘‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న నటుడిలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దర్శకుడు అభిరామ్‌ మేకింగ్ ఫ్రెష్ గా ఉంది. ‘జెస్సీ’ కి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సునీల్‌ కుమార్‌ బ్యూటిఫుల్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి’’ అన్నారు.

పవన్‌ తేజ్‌, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ ఎన్‌, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌, ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి,మాటలు: తాజుద్దీన్‌ సయ్యద్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌,  కో-డైరెక్టర్‌: కె. శ్రీనివాస్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి, లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి, నిర్మాత: రాజేష్‌ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్‌ ఎం.

Sponsored links

Ee Kathalo Patralu Kalpitham Movie Shooting Update:

Pawan Tej Konidela Movie First Schedule Completed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019