‘అలీ’ ఢిల్లీ ఎందుకెళ్లినట్లు.. బీజేపీలో చేరతారా!?

Comedian Ali To Join BJP?

Sun 26th Jan 2020 02:07 AM
Advertisement
comedian ali,tollywood,bjp,ysrcp,ys jagan mohan reddy  ‘అలీ’ ఢిల్లీ ఎందుకెళ్లినట్లు.. బీజేపీలో చేరతారా!?
Comedian Ali To Join BJP? ‘అలీ’ ఢిల్లీ ఎందుకెళ్లినట్లు.. బీజేపీలో చేరతారా!?
Advertisement

టాలీవుడ్ కమెడియన్‌గా సుపరిచితమైన అలీ.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారా..? అటు తిరిగి.. ఇటు తిరిగి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన... కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారా..? మళ్లీ పవన్‌‌కు అలీ దగ్గరవుతున్నాడా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమని తెలుస్తోంది.

2019 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన అధినేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లను వరుసగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అటు ఇటు తిరిగి చివరికి ఎవరూ ఊహించని రీతిలో తన భక్తుడైన పవన్ కల్యాణ్‌ను వదిలేసి మరీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే. అయితే ఆయన ఆశించిన ఎమ్మెల్యే టికెట్‌ను జగన్ ఇవ్వలేదని అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోగా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఏదైనా దక్కుతుందేమోనని అలీ భావించాడు. అది కూడా దక్కకపోగా.. చివరికి నిరాశ మిగలడంతో చేసేదేమీ లేక సొంతంగా ప్రొడక్షన్‌ రంగంలోకి దిగారు. మరోవైపు ఆయన బీజేపీలో చేరి పవన్‌కు దగ్గరవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే.. తాజాగా ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది చూసిన అందరూ ఇదేంటి అలీ బీజేపీలో చేరుతున్నాడా..? అని అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఆయన కాషాయ కండువా కప్పుకోవడానికి వెళ్లాడా..? లేకుంటే వేరు ఏమైనా కారణాలున్నాయా..? అనేది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి చూస్తే.. ఢిల్లీకెళ్లడం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో అలీ బ్రేకింగ్‌ న్యూస్‌లో నిలిచాడని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే పైకి మాత్రం తాను వేరే పనిమీద వెళ్లినట్లు అలీ కవరింగ్ చేస్తున్నాడట. అసలేం జరిగుంటదని ఆరాతీయగా.. అలీకి తెలిసిన ఓ హాలీవుడ్ డైరెక్టర్‌కు మోదీని కలవాలన్న ఆకాంక్షట. అందుకే బీజేపీ ఆఫీసుకెళ్లి.. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను కలిశాడట. ఆ తర్వాత ఇరువుర్నీ కలిసి మోదీని కలిశారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అలీ మీడియా ముందుకు రావాల్సిందే..

Advertisement

Comedian Ali To Join BJP?:

Comedian Ali To Join BJP?  

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement