చిరు 152 తర్వాత ఇంక సినిమాలు చేయడా?

Fri 24th Jan 2020 08:01 PM
mega star chiranjeevi,stop,movies,152 movie,tollywood  చిరు 152 తర్వాత ఇంక సినిమాలు చేయడా?
Chiranjeevi Rethinking on Movies after 152 Film చిరు 152 తర్వాత ఇంక సినిమాలు చేయడా?
Sponsored links

మెగాస్టార్ చిరు ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవడమే కాదు.... సైరా తో రెండు తెలుగు రాష్ట్రాల్లో దున్నేసాడు. కానీ పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152 మూవీ చేస్తున్నాడు. ఓ సాంగ్ తో మొదలైన షూటింగ్ ఇపుడు నిరవధికంగా సాగుతుంది. ఈసినిమాలో త్రిష చిరుకి హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అయితే చిరంజీవి ఈ సినిమా తర్వాత మరో సినిమా ఆలోచన చెయ్యడం లేదని.. అందుకే కొత్త కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనే న్యూస్ మెగా ఫాన్స్‌కి ఒణుకు పుట్టిస్తుంది.

చిరుతో త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ఇద్దరు సినిమాలు చెయ్యాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. కానీ చిరంజీవి మాత్రం కథలు వినడానికి సిద్ధంగా లేడని చెబుతున్నారు. ఈ వయసులో ఇంకా హీరోగా కొనసాగాలా.. లేదంటే ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్లు చేయాలా అనేది కొరటాల సినిమా తర్వాత ఆలోచిస్తారని అంటున్నారు. మరి కొరటాల శివతో చేసే సినిమా ఆఖరిది అయినా అవ్వొచ్చు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి. ఇది చూసిన మెగా ఫాన్స్ చిరు సినిమాలు వదిలేస్తే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి ఫాన్స్ కోసం చిరు మనసు మార్చుకుంటాడేమో చూడాలి.

Sponsored links

Chiranjeevi Rethinking on Movies after 152 Film:

Mega Star Chiranjeevi will stopped movies after 152

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019