‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్.. వర్మకు నచ్చేసిందట!

Fri 24th Jan 2020 01:51 PM
suicide club movie,trailer release,ram gopal varma,srinivas bogadapati  ‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్.. వర్మకు నచ్చేసిందట!
Director Ram Gopal Varma Launches Suicide Club Movie Trailer ‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్.. వర్మకు నచ్చేసిందట!
Sponsored links

3ఐ ఫిలిమ్స్ సమర్పణలో మజిలీ సినిమా ఫేమ్ శివ రామచంద్రవరపు లీడ్ రోల్‌లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3ఐ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబందించిన ట్రైలర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ లాంచ్ చేసారు. 

ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..‘‘సూసైడ్ క్లబ్ ట్రైలర్‌ను ఇప్పుడే చూడటం జరిగింది. మేకింగ్, సినిమాటోగ్రఫీ, కటింగ్ చాలా స్టైయిలిష్‌గా ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు. డైరెక్టర్ శ్రీనివాస్ చాలా బాగా తీసాడు. డైరెక్టర్ శ్రీనివాస్‌కు మరియు టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

డైరెక్టర్ శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ... ‘‘లెజెండరీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ‌గారు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా బిజీగా ఉన్నా.. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం..’’ అన్నారు.

శివ రామచంద్రవరపు, ప్రవీణ్ యండమూరి, చందన, సందీప్ రెడ్డి, వెంకట కృష్ణ, సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3ఐ ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం, మ్యూజిక్: కున్ని గుడిపాటి, ఎడిటర్: డే సెల్వ, ఆర్ట్: శాన్ నవార్, విజువల్స్: పవన్ కుమార్ తడక, కుమార్ నిర్మల సృజన్, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, సౌండ్: రాఘవ చరణ్.

Sponsored links

Director Ram Gopal Varma Launches Suicide Club Movie Trailer:

RGV Praises on Suicide Club Movie Trailer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019