క్రిష్ - పవన్ ఫిల్మ్: హీరోయిన్ ‌కూడా ఫిక్సా?

Thu 23rd Jan 2020 12:19 PM
pawan kalyan,krish,pragya jaiswal,heroine,director krish  క్రిష్ - పవన్ ఫిల్మ్: హీరోయిన్ ‌కూడా ఫిక్సా?
Heroine Fixed for Pawan Kalyan and Krish Film క్రిష్ - పవన్ ఫిల్మ్: హీరోయిన్ ‌కూడా ఫిక్సా?
Sponsored links

క్రిష్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా జనవరి 27 నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని, ఆ సినిమా 27నే మొదలు కాబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాని కమ్మేసింది. పింక్ రీమేక్‌తో పాటుగా క్రిష్ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడని అంటున్నారు. క్రిష్ కూడా పవన్ క్రేజ్‌కి తగ్గట్టుగా ఓ కథని తయారు చేసాడని, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగగా కనిపించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్‌తో ఇప్పుడు నటించబోయే హీరోయిన్స్ విషయంలో పిచ్చ క్యూరియాసిటీ నడుస్తుంది.

పింక్ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి అంజలి, నివేత థామస్, మల్లేశం ఫేమ్ అనన్యలు నటిస్తున్నారు. ఇక క్రిష్ సినిమాలో పవన్ సరసన ఫేడవుట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పేరు వినబడుతుంది. గ్లామర్‌తో అందాలు ఆరబోస్తూ కిందామీదా పడుతున్న ప్రగ్యా జైస్వాల్‌కి అవకాశాలు ఇచ్చే నాధుడు లేకపోయినా.. క్రిష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వలన పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌కి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ మొదలైంది. అయితే క్రిష్ - పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌కి అంతగా ప్రయారిటీ ఉండకపోవడంతో... ప్రగ్యాకు పవన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ దాదాపు ఖాయమైనట్టే అనే టాక్ వినిపిస్తోంది.

Sponsored links

Heroine Fixed for Pawan Kalyan and Krish Film:

Pragya Jaiswal in Pawan Kalyan and Krish Film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019