200 కోట్ల క్లబ్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

Wed 22nd Jan 2020 07:03 PM
sarileru neekevvaru,collections,200 crores club,mahesh babu  200 కోట్ల క్లబ్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’
Sarileru Neekevvaru in 200 Crores Club 200 కోట్ల క్లబ్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’
Sponsored links

200 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి ఛాంపియ‌న్‌గా నిలిచిన‌ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’!!

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 200 కోట్ల రియ‌ల్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి రియ‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచింద‌న్నారు ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర‌. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత‌ అనిల్ సుంకర మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ప్రేక్ష‌కుల, అభిమానుల‌ అపూర్వ ఆద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ మ‌హేశ్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్ప‌గా ఆద‌రిస్తున్న‌ ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌రియు మ‌హేశ్ అభిమానుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు.

Sponsored links

Sarileru Neekevvaru in 200 Crores Club:

Anil Sunkara says thanks to Telugu audience 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019