ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Unexpected Climax to Chaitu Love Story

చైతూ ‘లవ్ స్టోరీ’లో ఈ క్లైమాక్స్ నిజమేనా?

సాయి పల్లవి - నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చైతు మజిలీ తో సూపర్ హిట్, వెంకిమామతో  హిట్ అందుకోవడం, ఫిదా లాంటి లవ్ స్టోరీనే శేఖర్ కమ్ముల తెరకెక్కించడం, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ లో విడుదల టార్గేట్ గా తెరకెక్కుతున్న ఈసినిమా పై ఓ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఈ సినిమాలో పల్లెటూళ్లకు చెందిన అబ్బాయి, అమ్మాయిగా కనిపించనున్నారని... పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని తెలుస్తుంది. అయితే లవ్ స్టోరీ లో హ్యాపీ ఎండింగ్ ఉండదని.. ఈ సినిమా క్లైమాక్స్ విషాదాంతంగా దర్శకుడు రాసుకున్నాడు అని... నాగ చైతన్య పాత్ర సినిమా చివరిలో చనిపోతుందని.. సాయి పల్లవి మాత్రం చైతు జ్ఞాపకాలతో.. జీవితాంతం ఒంటరిగా మిలిపోతుందని అంటున్నారు. ఇక ఈ కథలో ఎంతో ఎమోషన్ ఉంటుందని.. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకుడు కంటతడి పెడతాడని అంటున్నారు.

Chaitu, Sai Pallavi Love Story Climax leaked

Unexpected Climax to Chaitu Love Story
naga chaitanya
sai pallavi
climax
love story
sekhar kammula