తరుణ్ ఆదర్శ్ ట్వీట్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించేనా?

Mon 20th Jan 2020 11:43 AM
tarun adarsh,tweet,confusion,rrr fans,rrr postpone  తరుణ్ ఆదర్శ్ ట్వీట్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించేనా?
Tarun Adarsh Tweet creates Confusion on RRR Fans తరుణ్ ఆదర్శ్ ట్వీట్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించేనా?
Sponsored links

ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్.. ‘గెస్ చేయండి’ అంటూ శనివారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఏముందంటే..‘‘గెస్ చేయండి.. సౌత్‌కు చెందిన ఓ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ చేస్తున్న చిత్రం విడుదల తేదీ మారనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ చిత్రం అక్టోబర్ 2020లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది’’. ఇది ట్వీట్‌లో ఉన్న సారాంశం. అయితే నెటిజన్ల చేస్తున్న గెస్ ప్రకారం.. ఆ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అనే తెలుస్తుంది. సౌత్ ఆయన చెప్పినంత గ్రాండ్ స్కేల్ ఉన్న చిత్రంకానీ, డైరెక్టర్ కానీ ‘ఆర్ఆర్ఆర్’, ‘రాజమౌళి’ మాత్రమే. అందుకే అందరూ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడనుంది అంటూ ఊహిస్తున్నారు. 

అయితే ‘ఆర్ఆర్ఆర్’ కాకుండా మరో చిత్రం కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లుగా నెటిజన్లు చెబుతున్నారు. ఆ చిత్రం మరేదో కాదు ‘కెజిఎఫ్ చాప్టర్ 2’. యష్ నటించిన ‘కెజిఎఫ్’ చిత్రం ఎటువంటి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. చాప్టర్ 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ప్రకారం ఈ చిత్రం కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చిత్రం ఏప్రియల్‌లో విడుదల కావాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాలనే తరుణ్ చేసిన ట్వీట్‌కు రిప్లైగా చెబుతున్నారు నెటిజన్లు. మరి ఈ ఉత్కంఠకు తరుణ్ ఎప్పుడు తెరదించుతూ ట్వీట్ చేస్తాడో చూద్దాం.

Sponsored links

Tarun Adarsh Tweet creates Confusion on RRR Fans:

RRR Movie Release Postponed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019