Advertisementt

విష్ణు మంచు ‘మోస‌గాళ్ళు’ అప్డేట్ వచ్చింది

Sun 19th Jan 2020 01:46 PM
vishnu manchu,suniel shetty,mosagallu,movie,hollywood,update  విష్ణు మంచు ‘మోస‌గాళ్ళు’ అప్డేట్ వచ్చింది
Hollywood Stunt Team for Vishnu Manchu Mosagallu విష్ణు మంచు ‘మోస‌గాళ్ళు’ అప్డేట్ వచ్చింది
Advertisement
Ads by CJ

విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో  ‘మోస‌గాళ్ళు’ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

విష్ణు మంచు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘మోస‌గాళ్ళు’. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో  హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా నిపుణుల‌ పర్యవేక్ష‌ణ‌లో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను మాస్ట‌ర్ పీస్‌లా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:  

విష్ణు మంచు, సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

నిర్మాత‌:  విష్ణు మంచు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  విజ‌య్ కుమార్‌.ఆర్‌

ద‌ర్శ‌క‌త్వం:  జెఫ్రీ గీ చిన్‌

సినిమాటోగ్ర‌ఫీ:  షెల్డ‌న్ చౌ

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  కిర‌ణ్ కుమార్‌.ఎం

Hollywood Stunt Team for Vishnu Manchu Mosagallu:

Hollywood Stunt Team Goes Behind Vishnu Manchu and Suniel Shetty ‘Mosagallu’ Explosive action

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ