‘అదిరింది’ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్

Nagababu Master plan for Adirindi Show

Fri 17th Jan 2020 07:02 PM
nagababu,adirindi,jabardasth,show,master plan  ‘అదిరింది’ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్
Nagababu Master plan for Adirindi Show ‘అదిరింది’ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్
Advertisement

జబర్దస్త్ దెబ్బకి నాగబాబు అదిరింది షో అతలాకుతలం అవుతుంది. అదిరింది షోకి ఎలాగైనా హైప్ తీసుకొచ్చి.. హిట్ చెయ్యాలంటే నాగబాబు వల్ల కావడం లేదు. జబర్దస్త్ ముందు అదిరింది వెలవెలబోతోంది. అందులోను అదిరింది షో టైం లోనే జబర్దస్త్ స్కిట్స్ వెయ్యడంతో... అదిరింది షో కి పంచ్ ల మీద పంచ్ లు పడుతుంది. నాగబాబుకి ఎటు పాలుపోవడం లేదు... అదిరింది షో రేటింగ్ కోసం నాగబాబు ఎంత చెయ్యాలో అంతా చేస్తున్నప్పటికీ.. అదిరింది షో కి మాత్రం రేటింగ్ రావడం లేదు. ఇక నాగబాబు షో నుండి ఎగ్జిట్ అవుతాడని న్యూస్ కూడా నడిచింది.

అయితే తాజాగా జబర్దస్త్ షో ని తట్టుకోవడానికి నాగబాబు ప్లాన్ మార్చినట్లుగా తెలుస్తుంది. అదిరింది షో... జబర్దస్త్ రేటింగ్స్‌ను బీట్ చెయ్యడమే లక్ష్యంగా నాగబాబు తాజాగా రంగంలోకి దిగినట్టు సమాచారం. అందులో భాగంగానే నాగబాబు అదిరింది షో కోసం కొత్త స్టార్లను రంగంలోకి దింపుతున్నాడట. అలాగే కొత్తగా తీసుకొచ్చిన కమెడియన్స్ తో సరికొత్త కామెడీ ట్రాక్ సిద్ధం చేస్తున్నారట. మరి జబర్దస్త్ తో పోటీ అంటూ కొత్త షో ప్లాన్ చేసిన క్రియేటివ్ మైండ్స్ ఉన్న నితిన్, భరత్ లు కూడా అదిరింది ని ఎలాగైనా లేపాలని చూస్తున్నారు. కానీ.. జబర్దస్త్ షో మాత్రమే అదిరింది షో ని వారం వారం తొక్కుతూనే ఉంది. మరి ఈ కొత్త ప్లాన్ ఏమైనా అదిరింది షో రేటింగ్ ని నిలబెడుతుందో లేదో చూడాలి.

Nagababu Master plan for Adirindi Show:

Nagababu New Plan to beat Jabardasth


Loading..
Loading..
Loading..
advertisement