రష్మిక ఇంటిపై ఈ టైమ్‌లో ఐటీ దాడులేంటి?

IT Shock to Rashmika Mandanna

Fri 17th Jan 2020 06:48 PM
rashmika mandanna,heroine,tollywood,sarileru neekevvaru,it shock  రష్మిక ఇంటిపై ఈ టైమ్‌లో ఐటీ దాడులేంటి?
IT Shock to Rashmika Mandanna రష్మిక ఇంటిపై ఈ టైమ్‌లో ఐటీ దాడులేంటి?
Advertisement

రష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హీరోయిన్. ప్రస్తుతం సీనియర్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పబడుతున్న రష్మికను ఐటీ సెగ దాకింది. ‘గీతగోవిందం’ సినిమాతో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది హీరోయిన్‌గా మారిన రష్మిక.. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ వచ్చి మంచి హిట్టందుకుంది. అలాగే నితిన్‌తో ‘భీష్మ’, అల్లు అర్జున్ - సుక్కు చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుని టాలీవుడ్‌లో క్షణం తీరికలేని హీరోయిన్‌గా గడుపుతుంది. అయితే ఈ అవకాశాలే ఇప్పుడు ఈమెపై ఐటీ చూపు పడేలా చేసినట్లుగా టాక్ నడుస్తుంది.

కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక మందన్నా ఇంట్లో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాల్లో ఏమేం దొరికాయనే విషయంపై క్లారిటీ లేదు కానీ, ప్రస్తుతం ఆమెపై ఐటీ దాడి జరగడమే హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ, తెలుగు సినిమాలతో బిజీబిజీగా ఉన్న రష్మిక సరిగా ట్యాక్స్ కట్టడం లేదనే ఆరోపణల నేపథ్యంలోనే ఆమెపై ఐటీ ఎటాక్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ అధికారులు దాడి చేశారనే విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి పరుగులు పెట్టిన రష్మిక.. ఈ ఎటాక్ గురించి ఏ విధంగా స్పందిస్తుందో వెయిట్ అండ్ సీ. 

IT Shock to Rashmika Mandanna:

Sarileru beauty gets IT shock


Loading..
Loading..
Loading..
advertisement