పవన్ నమ్మి బాధపడుతున్న బడా ప్రొడ్యూసర్!?

Fri 17th Jan 2020 07:41 AM
top producer,struggle,pawan kalyan,janasena,pink remake,tollywood  పవన్ నమ్మి బాధపడుతున్న బడా ప్రొడ్యూసర్!?
Top Producer Struggle From Pawan kalyan.. Details Here..!! పవన్ నమ్మి బాధపడుతున్న బడా ప్రొడ్యూసర్!?
Sponsored links

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న రేంజ్ మరే హీరోకు ఇప్పటికీ లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. మరీ ముఖ్యంగా.. నాటికి నేటికి పవన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. అందుకేనేమో అదే స్థానానికి మళ్లీ పవన్ రావడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడెప్పుడో ఎన్నికలకు ముందు సినిమాలకు టాటా చెప్పేసి వెళ్లిపోయిన గబ్బర్ సింగ్.. ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టడంతో పాటు సినిమా షూట్ షురూ చేయడం జరిగింది. పవన్‌కు సంబంధంలేని కొన్ని కొన్ని పాత్రలను తెరకెక్కిస్తున్నారు.

పవన్‌తో సినిమా చేయాలన్న కోరికతో ఏరి కోరి మరీ ‘పింక్’ సినిమాను సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెమ్యునరేషన్, బడ్జెట్ విషయంపై క్లారిటీ వచ్చేసిందట. ఎన్నికల సమయంలో సినిమా చేస్తానని దిల్ రాజు దగ్గర అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడని అప్పట్లో టాక్ నడిచింది. అందుకే ఈ రీమేక్‌కు ఆయన ఒప్పుకున్నాడని తెలిసింది. అయితే డేట్స్ ఇవ్వడం కూడా అయిపోయాయ్.. పవన్ మాత్రం ఇటు రాజకీయాల్లో బిజిబిజీగా ఉండటంతో అసలు సినిమా అవుతుందో లేదో అని దిల్ రాజ్ టెన్షన్ పడుతున్నాడట.

అంతేకాదు.. ఇప్పుడింకా బీజేపీ-జనసేన రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లాలని నిర్ణయానికి రావడంతో పవన్ ఫ్రీగా దొరికే అవకాశాలు అస్సలే కనిపించట్లేదు. దీంతో పవన్ నమ్మి అనవసరం బొక్కా బోర్లా పడ్డానని సన్నిహితులు చెప్పుకుని దిల్ రాజు బాధపడుతున్నాడట. వాస్తవానికి సంక్రాంతి పండుగ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటానని నిర్మాతకు పవన్ మాటిచ్చారని తెలుస్తోంది. మరి రీమేక్‌‌కు న్యాయం చేసి.. దిల్ రాజుకు ఆ బాధ భారం దించుతాడో లేదో తెలియాలంటే పండుగ అయిపోయేంతవరకూ వేచి చూడాల్సిందే.

Sponsored links

Top Producer Struggle From Pawan kalyan.. Details Here..!!:

Top Producer Struggle From Pawan kalyan.. Details Here..!!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019