ఆ ఇద్దరిలో ఎవరు.. కన్ఫూజన్‌లో త్రివిక్రమ్!

Thu 16th Jan 2020 07:55 PM
trivikram srinivas,confused,next movie,jr ntr,prabhas  ఆ ఇద్దరిలో ఎవరు.. కన్ఫూజన్‌లో త్రివిక్రమ్!
Trivikram Srinivas Confused.. Next Movie!! ఆ ఇద్దరిలో ఎవరు.. కన్ఫూజన్‌లో త్రివిక్రమ్!
Sponsored links

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొన్ని కొన్ని అట్టర్ ప్లాప్ సినిమాల తర్వాత మళ్లీ క్రీజ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడెప్పుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ తెరకెక్కించిన తర్వాత మాటల మాంత్రికుడు అడ్రస్ లేదు. అయితే.. ఈసారి కొడితే కుష్మాండం బద్ధలైపోవాల్సిందే.. మళ్లీ పాతరోజులు రావాల్సిందేనని గట్టిగా పట్టుదలతో కథ రాసుకుని రంగంలోకి దిగిన త్రివిక్రమ్.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీతో ‘అల వైకుంఠపురములో’ తెరకెక్కించి తన రేంజ్‌ ఎక్కడికీ పోలేదు.. ఇదిగో అంటూ కలెక్షన్లు, సినిమా సూపర్‌ డూపర్ హిట్ చేసి చూపించాడు. అయితే ఇదే ఊపు మీద తదుపరి సినిమా ఎవరితో తెరకెక్కించబోతున్నాడు..? ఈ సారి ఏ జోనర్‌లో సినిమా ఉంటుంది..? అనేదానిపై ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

అయితే.. ఇద్దరి హీరోల లైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాగా.. మరొకరు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఉన్నారట. త్రివిక్రమ్ చేతిలో ఇప్పుడు కథ రెడీగా ఉంది. ఇప్పటికే మాటల మాంత్రికుడు-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇంకో సినిమా చేద్దాం సార్ అని బుడ్డోడు ఆయనతో అన్నట్లు తెలిసింది. ఆ కథ ఎన్టీఆర్‌కు అయితే సెట్ అవుతుందని పైగా ఫ్యామిలీ ఎంటైర్‌టైనర్ కావడంతో ఆయన కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకి ‘హారిక అండ్ హాసిని’ చినబాబు, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారట.

మరోవైపు.. ఇప్పటి వరకూ దాదాపు అన్ని జోనర్ సినిమాలు చూసేసిన ప్రభాస్.. ఓ మంచి ఫ్యామిలీ కథ కోసం వేచి చూస్తున్నాడు. ఎన్టీఆర్‌తో కాకుండా ప్రభాస్‌తో తెరకెక్కిస్తే తాను నిర్మాతగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ బడా నిర్మాత రంగంలోకి దిగారట. వాస్తవానికి త్రివిక్రమ్-ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా తప్పకుండా వస్తుందని.. ఎప్పట్నుంచో వార్తలు వచ్చాయి. అయితే.. అటు ఎన్టీఆర్‌ కూడా సిద్ధంగా ఉండటం.. ఇటు ప్రభాస్‌ కూడా మొగ్గు చూపడం.. మధ్యలో నిర్మాత కూడా బాగా ఒత్తిడి తీసుకొస్తున్న తరుణంలో త్రివిక్రమ్ ఎవరికి మొగ్గు చూపుతారో ఏంటో మరి.

Sponsored links

Trivikram Srinivas Confused.. Next Movie!!:

Trivikram Srinivas Confused.. Next Movie!!

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019