రష్మిక డైట్..: అవి తినలేక ఐస్‌క్రీం తిన్నదట!

Wed 15th Jan 2020 12:22 AM
rashmika,sarileru neekevvaru,diet plan,vegetables  రష్మిక డైట్..: అవి తినలేక ఐస్‌క్రీం తిన్నదట!
Heroine Rashmika About Her Diet Plan రష్మిక డైట్..: అవి తినలేక ఐస్‌క్రీం తిన్నదట!
Sponsored links

గత ఏడాది డియర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న రష్మిక మందన్న ఈ ఏడాది మొదట్లోనే మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అంటూ భారీ హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక - మహేష్ జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు మాస్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక చూడడానికి చిన్న పిల్లలా ఉంటుంది. కానీ నటనలో మాత్రం సూపర్ అనిపించేలా అభినయం ఉంటుంది. అయితే ఇప్పుడు రష్మిక స్టార్ హీరోయిన్ గా ఆమె రేంజ్ పెరుగుతుంది కానీ.. ఆమె హైట్ ఆమెకి కాస్త ప్రాబ్లమ్. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటోళ్ళు ఓకే కానీ.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటోళ్ళతో రష్మిక నటించాలంటే కాస్త కష్టమే. మరి సరిలేరు నీకెవ్వరు సినిమాలో మీకు అర్ధమవుతుందా అనే మ్యానరిజంతో ఆకట్టుకున్న రష్మిక డైట్ ప్లాన్ ఏమిటంటే..

రష్మిక డైట్ పక్కాగా ఫాలో అవుతుందట. ఉదయం లేవగానే ఓ లీటరు వాటర్ తాగుతుందట. ఇంకా డైటీషియన్ చెప్పినట్టుగా ఆపిల్ సీడర్ వెనిగర్ వాడుతుంది. అయితే ఈమధ్యనే వెజిటేరియన్ గా మారిన రశ్మికకి చాలారకాల కూరగాయలంటే నచ్చవట. అందులో బంగాళాదుంప, దోసకాయ, టమాటా, క్యాప్సికం లాంటివి అస్సలు నచ్చవట. అలాగే ఇంకా చాలారకాల కూరగాయలను ఇష్టపడని రష్మిక ఇటలీ షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ  కూరగాయలు తినడం ఇష్టం లేక కేవలం ఐస్ క్రీం తింటూ పొట్ట నింపుకుందట.

Sponsored links

Heroine Rashmika About Her Diet Plan:

Rashmika Hates Vegetables

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019