Advertisement

‘సరిలేరు..’ సైనికుల‌కు అంకిత‌మిస్తున్నాం!

Mon 06th Jan 2020 05:59 PM
sarileru movie,dedicated,border sainiks,vijayasanthi  ‘సరిలేరు..’ సైనికుల‌కు అంకిత‌మిస్తున్నాం!
Sarileru Movie Dedicated To Border Sainik ‘సరిలేరు..’ సైనికుల‌కు అంకిత‌మిస్తున్నాం!
Advertisement

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్నివిడుద‌ల‌ చేస్తున్నారు. కాగా ’సరిలేరు నీకెవ్వరు’  మెగాసూప‌ర్ ఈవెంట్‌ జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో అశేష అభిమానుల‌ సమక్షంలో వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని ’సరిలేరు నీకెవ్వరు’ ట్రైల‌ర్‌ని విడుద‌ల‌చేశారు.ఈ సంద‌ర్భంగా..

న‌ట విశ్వ భార‌తి, లేడి అమితాబ్ విజ‌య‌శాంతి మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవిగారికి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌గారికి, మా తోటి న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కి, మా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిగారికి, నిర్మాత‌లు అనీల్ సుంక‌ర‌గారికి, దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌.  1979 నుండి 2020 వ‌ర‌కు నాది లాంగ్ జ‌ర్నీ. మీ అంద‌రితో క‌లిసి న‌డిచాను. న‌న్ను ఆ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు. మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. యాక్ష‌న్ మూవీస్‌, కామెడీ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేశాను.. మెగాస్టార్ చిరంజీవిగారితో క‌లిసి ప‌లు సినిమాలు చేశాను. అణ‌గ‌దొక్క‌బ‌డుతున్న మ‌హిళ‌లంద‌రికీ నేనున్నాను మీకోసం ధైర్యంగా అడుగు ముందుకేయండి అని నా సినిమాలు చాలా సంద‌ర్భాల్లో చెప్పాయి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురుచూడ‌కండి.. రేప‌టి జీవితం మీదే.. మ‌హిళాశ‌క్తులు మీరే. 1988లో లిటిల్ స్టార్ మ‌హేశ్‌తో కృష్ణ‌గారి డైరెక్ష‌న్‌లో నేను న‌టించాను. నేను మ‌ళ్లీ మ‌హేశ్‌బాబుతో ప‌నిచేస్తాన‌ని అనుకోలేదు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి న‌న్ను ప‌రిచ‌యం చేసింది హీరో కృష్ణ‌గారు. నా మొద‌టి హీరో ఆయ‌నే. విజ‌య నిర్మల‌గారిని కూడా ఈరోజు మ‌ర‌చిపోలేను. కృష్ణగారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. మ‌ళ్లీ రీ ఎంట్రీ మ‌హేశ్‌గారితో కావ‌డం ఆశ్చ‌ర్య‌కరంగా ఉంది. మహేశ్ అబ్బాయి గౌత‌మ్‌తో కూడా యాక్ట్ చేయ‌డానికి నేను సిద్ధంగానే ఉన్నాను.

మ‌హేశ్ బంగారం. డౌన్ టు ఎర్త్‌. ఒక‌మాట‌లో చెప్పాలంటే.. బంగారం. సూప‌ర్‌స్టార్ అనే ప‌దానికి అర్థం మ‌హేశ్‌బాబుగారు. అంచెలంచెలుగా ఎద‌గ‌డం, ఒద‌గ‌డం, నేర్చుకోవ‌డం, మీ అభిమానాన్ని సంపాదించ‌డం చూస్తుంటే.. మ‌హేశ్‌ని మించిన‌వారు లేరు. కొత్తద‌నం కావాల‌ని ప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూ వ‌చ్చారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా చాలా కొత్త‌గా ఉంటుంది. ఆయ‌నేనా న‌టించింది అని నాకు డౌట్ వ‌స్తుంది. కామెడీ అద్భుతంగా చేశాడు. ఇక డాన్స్ అయితే రెచ్చిపోయాడ‌నే చెప్పాలి. మా కాంబినేష‌న్లో సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. 13 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ మ‌హేశ్‌తో ఇవ్వ‌డం ఆనందంగా ఉంది. సినిమాల్లోనే కాదు.. నిజంగా కూడా ఆయ‌న సూప‌ర్‌స్టార్‌. వెయ్యి మంది ఆడ‌పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేశారంటే.. మామూలు విష‌యం కాదు.. గ్రేట్ అనే చెప్పాలి. ఆయ‌న‌, ఆయ‌న భార్యా పిల్ల‌లు వందేళ్లు బావుండాల‌ని దీవిస్తున్నాను. డైరెక్ట‌ర్ అనిల్ కామెడీ సినిమాల‌తో అద్భుతంగా చూపించారు. ర‌ష్మిక చ‌క్క‌గా న‌టించింది. కొత్త ట్రెండ్ తీసుకొస్తుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ పాత్ర‌కు నేను న్యాయం చేస్తాన‌నే గ‌ట్టి న‌మ్మి నాతో ఈ పాత్ర‌ను చేయించారు. నా శాయ‌శ‌క్తులా నా పాత్ర‌కు న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. ర‌త్న‌వేలుగారు అద్భుతంగా మ‌మ్మ‌ల్ని చూపించారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అంద‌రూ అద్భుతంగా చేశారు. జ‌న‌వ‌రి 11న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. బోర్డ‌ర్‌లో మ‌న కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఈ సినిమాను అంకిత‌మిస్తున్నాం’ అన్నారు.

Sarileru Movie Dedicated To Border Sainik:

Sarileru Movie Dedicated To Border Sainik  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement