Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Disco Raja Pre-Release Event Date Fixed

‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే?

Disco Raja Pre-Release Event Date Fixed

జనవరి 18న డిస్కోరాజా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఢిల్లీవాలా..’, ‘నువ్వు నాతో’ పాటలు ఇప్పటికే విడుదలై పాపులర్ అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 18న గ్రాండ్ గా చేయబోతున్నారు. డిస్కోరాజాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం కార్తీక్‌ ఘట్టమనేని, అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు.

Disco Raja Pre-Release Event to be Held on January 18th

ravi teja
disco raja
movie
pre-release
event
january 18