Advertisementt

బాలయ్య-బోయపాటి మూవీ : హీరోయిన్‌ ఈమేనా?

Sat 04th Jan 2020 07:59 PM
rakul preet singh,balakrishna,boyapati srinu,new movie,heroine  బాలయ్య-బోయపాటి మూవీ : హీరోయిన్‌ ఈమేనా?
Balayya and Boyapati Movie Heroine Confirmed బాలయ్య-బోయపాటి మూవీ : హీరోయిన్‌ ఈమేనా?
Advertisement
Ads by CJ

‘సింహ’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే.. ఈ క్రమంలో సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? ముఖ్యంగా హీరోయిన్ సంగతేంటి..? సీనియర్‌ను తీసుకుందామా..? లేకుంటే జూనియర్‌ను తీసుకుందామా..? అని బోయపాటి సెర్చింగ్‌లో ఉన్నారట. అయితే ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు పేర్లు వెలుగులోకి రావడం.. వాళ్లంతా అందరూ దాదాపు ఖండించడం జరిగిపోయింది.

అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్‌సింగ్ పేరు ప్రచారంలో ఉంది. బాలయ్య సినిమాలో నటించాలని రకుల్‌ను అడగటం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రెండూ జరిగిపోయాయట. వాస్తవానికి ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తగ్గాయి. అందుకే సీనియర్ హీరో.. పైగా స్టార్ హీరోల్లో ఒకరైన బాలయ్య సినిమా కావడంతో రకుల్ ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

ఇదిలా ఉంటే.. ఇటీవలే మీడియాతో మాట్లాడిన రకుల్.. సినిమా ఒప్పుకునే ముందు ఎక్కువగా ఏమీ ఆలోచించనని చెప్పింది. సినిమాకి ముందు ఏ దర్శకుడు చెప్పినా ఆ కథ చాలా బాగుందనిపిస్తుందని.. ఫైనల్‌గా సినిమాగా రూపొందాక అది ఎలా వస్తుందనేది మనం ఊహించలేమని చెప్పుకొచ్చింది. మొత్తానికి చూస్తే.. బోయపాటి-బాలయ్య సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోందని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఇక రావాల్సిందే అధికార ప్రకటన ఒక్కటే అన్న మాట.

Balayya and Boyapati Movie Heroine Confirmed:

Rakul Preet Singh In Balayya and Boyapati Movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ