ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sri Reddy Dorikipoyindi Movie First Look

‘శ్రీరెడ్డి దొరికిపోయింది’ అంటున్నారు

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో  ‘శ్రీ‌రెడ్డి దొరికిపోయింది’ (మాన‌వ‌మృగాలకు) ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!!

ఎస్ఎస్ఆర్ ఆర్య‌న్‌, ఉపాస‌న హీరోహీరోయిన్లుగా రాహుల్ ప‌ర‌మ‌హంస ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘క‌రుతుక‌లై ప‌తివు సెయ్‌’. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో యశ్వంత్ మూవీస్ ప‌తాకంపై ‘శ్రీ‌రెడ్డి దొరికిపోయింది’ (మాన‌వ‌మృగాలకు అనేది టాగ్‌లైన్‌) పేరుతో నిర్మాత డి. వెంకటేశ్ విడుద‌ల‌చేస్తున్నారు. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డి. వెంక‌టేశ్ మాట్లాడుతూ.. ‘‘త‌మిళ్‌లో పెద్ద విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని మా బేన‌ర్‌లో విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం స‌మాజంలో ఆడ‌వారిపై జ‌రుగుతున్న హ‌త్యాచారాల నేప‌థ్యంలో సినిమా ఉంటుంది. వాటికి గ‌ల కార‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త‌లు ఈ మూవీలో చూపించ‌డం జ‌రిగింది. మ‌న నేటివిటికి త‌గ్గ‌ట్లు మాతృక‌లో కొన్ని మార్పులు చేశాం. జీత‌న్2 లాంటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కించిన  రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లో విడుద‌ల‌తేదిని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

ఎస్ఎస్ఆర్ ఆర్య‌న్‌, ఉపాస‌న హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి

ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ప‌ర‌మ‌హంస,

నిర్మాత: డి. వెంకటేశ్,

ఎడిటింగ్‌: గ‌ణేశ్ కుమార్‌. డి,

సంగీతం: గ‌ణేశ్ రాఘ‌వేంద్ర‌,

సినిమాటోగ్ర‌ఫి: మ‌నోహ‌ర్,

పిఆర్ఓ: సాయి సతీశ్.

New Year Special: Sri Reddy Dorikipoyindi First Look Out

Sri Reddy Dorikipoyindi Movie First Look
sri reddy dorikipoyindi
new year special
new year special
d venkatesh
rahul paramahamsa