Advertisementt

విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుదల

Thu 02nd Jan 2020 02:50 PM
hit movie,first glimpse,vishwak sen,release date  విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుదల
Vishwak Sen’s ‘HIT’ First Glimpse and Release date Announcement విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుదల
Advertisement
Ads by CJ

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నాని నిర్మాణంలో విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

‘‘ఒక‌సారి ఇలాంటి ఇన్సిడెంటే ఈ నీలైఫ్‌లో జ‌రిగిన‌ప్పుడు యు లాస్ట్ స‌మ్ వ‌న్ యు ల‌వ్డ్‌. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి సిచ్యువేష‌నే వ‌చ్చింది. వాట్ యు వాంట్ టు డు అబౌట్ ఇట్‌’’ అనే డైలాగ్‌తో ఓ సీరియ‌స్ ఇష్యూ వ‌ల్ల ఐపీయ‌స్ ఆఫీస‌ర్ ఎలాంటి స‌మ‌స్య‌లో ఉన్నాడు? అని గ్లింప్స్‌తో ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. అలాగే పోలీస్ ఆఫీస‌ర్ అయిన విశ్వ‌క్‌సేన్ ఎవ‌రినో వెతుక్కుంటూ ఓ ఇంట్లోకి వెళ్లే స‌న్నివేశాన్ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. వివేక్ సాగ‌ర్ సంగీతం.. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. సినిమాను ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:

విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను

స‌మ‌ర్ప‌ణ‌: నాని

నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని

మ్యూజిక్‌: వివేక్‌సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌

ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌

ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)

స్టంట్స్‌: న‌భా

ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను

పి.ఆర్‌.ఓ: వంశీ కాకా

Vishwak Sen’s ‘HIT’ First Glimpse and Release date Announcement:

HIT Movie First Glimpse Released

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ