అనసూయ అక్కడా.. ఇక్కడా ఇరగదీస్తోంది! అంటే లోకల్ గ్యాంగ్స్ కి టాప్ టీఆర్పీ వచ్చేసి జబర్దస్త్ టీఆర్పీ పరంగా వెనకబడింది అని కాదు ఇక్కడ ఉద్దేశ్యం. హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షోలో చేసే హాట్ షో వేరు. లోకల్ గ్యాంగ్స్ షోలో జడ్జ్ గా అనసూయ చేసే హాట్ జబర్దస్త్ కు మించి అన్న రేంజ్ లో ఉందని ఎప్పుడో మాట్లాడుకున్నాం. అసలు జబర్దస్త్ లో అనసూయ మోడరన్ డ్రస్సులతో, డిజైనర్ సారీస్ తో ఒలకబోసే అందాలు, ఆదితో అప్పుడప్పుడు సెక్సీగా వేసే స్టెప్స్... జబర్దస్త్ కామెడీ స్కిట్స్ కన్నా ఎక్కువగా జబర్దస్త్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. మరి అనసూయ హాట్ అందాలు జబర్దస్త్ కే పరిమితం కాదుగా.. అందుకే లోకల్ గ్యాంగ్స్ అంటూ అనసూయ జీ ఛానల్ లో కూడా ఓ ఊపు ఊపుతుంది.
జానీ మాస్టర్ తో అనసూయ వేసే హాట్ అండ్ సెక్సీ స్టెప్స్ అబ్బబ్బా లోకల్ గ్యాంగ్స్ షోకే హైలెట్. జానీ మాస్టర్ తో కసిరేపే డాన్స్ తో అనసూయ అదరగొట్టేస్తుంది. జడ్జ్ గా వస్తున్న లోకల్ గ్యాంగ్స్ షోలో అనసూయ డాన్స్, ఆమె అందాలు అన్ని ఎంట్రీలోనే ఆస్వాదించేస్తున్నారు. జానీ మాస్టర్ తో పోటీ పడి అనసూయ వేస్తున్న డాన్స్, రవి, ప్రదీప్ ల కామెడీ అన్ని లోకల్ గ్యాంగ్స్ ని ఎక్కడో నించోబెట్టేలా కనబడుతుంది. మరి ఇప్పటికే జబర్దస్త్ vs అదిరింది అంటూ ప్రచారం జరుగుతుంటే... ఇప్పుడు అనసూయ హాట్ అందాలు వలన జబర్దస్త్ vs లోకల్ గ్యాంగ్స్ అనాల్సి వచ్చేలా ఉంది.




‘సరిలేరు..’ కి చిరు చాలడా?
Loading..