Advertisementt

నాని నిర్మాణంలో విశ్వక్‌ సేన్ ‘హిట్‌’ మూవీ ఫ‌స్ట్ లుక్

Thu 26th Dec 2019 01:28 PM
hit movie first look,vishwak sen,nani,sailesh kolanu,vivek sagar  నాని నిర్మాణంలో విశ్వక్‌ సేన్ ‘హిట్‌’ మూవీ ఫ‌స్ట్ లుక్
HIT Movie First Look నాని నిర్మాణంలో విశ్వక్‌ సేన్ ‘హిట్‌’ మూవీ ఫ‌స్ట్ లుక్
Advertisement
Ads by CJ

హీరోగా ప‌లు వైవిధ్యమైన చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించి త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నేచుర‌ల్ స్టార్ నాని. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్రమంలో భాగంగా వాల్‌పోస్టర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్రయ‌త్నంలోనే ‘అ!’ వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్షకుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధించారు. ఇప్పుడు నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ ఫేమ్‌ విశ్వక్‌సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శక‌త్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న చిత్రం ‘హిట్‌’. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

ప్రస్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. క్రిస్మస్ సంద‌ర్భంగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్‌గా క‌న‌ప‌డుతున్నారు. సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ విక్రమ్ రుద్రరాజు అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో విశ్వక్‌సేన్ ప్రేక్షకుల‌ను మెప్పించ‌నున్నారు. కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ‘హిట్’ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. మ‌ణికంద‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

న‌టీన‌టులు :-

విశ్వక్‌సేన్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం:  శైలేష్ కొల‌ను

స‌మ‌ర్పణ‌:  నాని

నిర్మాత‌: ప‌్రశాంతి త్రిపిర్‌నేని

మ్యూజిక్‌:  వివేక్‌సాగ‌ర్‌

సినిమాటోగ్రఫీ:  మ‌ణికంద‌న్‌

ఆర్ట్‌:  అవినాష్ కొల్ల

ఎడిటర్‌:  గ్యారీ బి.హెచ్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)

స్టంట్స్‌: న‌భా

ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌:  అనిల్ భాను

పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

HIT Movie First Look:

  HIT Movie First Look

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ