Advertisement

మరో మంచి పనిచేసిన ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్

Fri 20th Dec 2019 01:07 PM
sai tej,raashi khanna,film newscasters association,prathi roju pandage,team,green india challenge  మరో మంచి పనిచేసిన ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్
Film Newscasters Association Green India Challenge Program Details మరో మంచి పనిచేసిన ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్
Advertisement

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు 

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారితహారం , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి. MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం ఖండంతారాలు దాటి మొక్కలు నాటడం, పెంచడంపై అవగాహాన, అవసరం తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్ కూడా తమ వంతు బాధ్యతను పాలు పంచుకుంది. ప్రతిరోజు పండగే టీంతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ లతో బంజారాహిల్స్ లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్ లో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అయ్యారు.

ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ:

‘‘MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ ప్రోగ్రాం నన్ను ఎంతో ఆకర్షించింది. అలాగే ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నన్ను భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వ హించాలి.  పర్యావరణంని రక్షించుకోవడం అందరి బాధ్యత’’ అన్నారు. 

రాశీ ఖన్నా మాట్లాడుతూ:

‘‘ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత’’ అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ:

‘‘ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మరో ముగ్గురుచేత ఈ మొక్కలు నాటే కార్యక్రమంని  చేపట్టేలా చూడాలి. మా టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ:

‘‘ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఎమ్ పి సంతోష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం మంచి విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అవ్వడం నాకు ఆనందంగా ఉంది. ప్రకృతిని  కాపాడుకోవడంలో అందరూ చేతులు కలపాలి’’ అన్నారు.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ:

‘‘హారిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాంలు చాలా బాగా సక్సెస్ అయ్యాయి. MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఖండాంతరాలు దాటింది. ఈ కార్యక్రమంలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సహా నిర్మాత SKN, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉప అధ్యక్షులు రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Film Newscasters Association Green India Challenge Program Details:

Film Newscasters Association and Prathi Roju Pandage team in Green India Challenge

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement