Advertisementt

Ads by CJ

‘ద‌బాంగ్ 3’ అందరికీ నచ్చుతుంది: సల్మాన్

Thu 19th Dec 2019 07:33 PM
dabangg3 movie,pre release event,salman khan,venkatesh,sudeep,ram charan,prabhudeva  ‘ద‌బాంగ్ 3’ అందరికీ నచ్చుతుంది: సల్మాన్
Dabangg3 Movie Pre Release Event Details ‘ద‌బాంగ్ 3’ అందరికీ నచ్చుతుంది: సల్మాన్
Advertisement
Ads by CJ

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా స‌ల్మాన్‌ఖాన్ ఫిలింస్‌, అర్బాజ్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, స‌ఫ్రాన్ బ్రాడ్‌కాస్ట్ మీడియా లి. ప‌తాకాల‌పై స‌ల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది నిర్మిస్తోన్న చిత్రం ‘ద‌బాంగ్ 3’. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ విడుద‌ల చేస్తుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో...

అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో రెండు ప్రేమ పాట‌లు రాసే అవ‌కాశం క‌లిగింది. ప్ర‌భుదేవాగారికి, స‌ల్మాన్‌ఖాన్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు.

రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్‌టైన‌ర్‌. హిందీలో స‌క్సెస్ అవుతుంది. అక్క‌డ‌లాగానే తెలుగులోనూ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ‘‘స‌ల్మాన్‌గారిలో క‌లిసి ద‌బాంగ్ 3లో న‌టించడాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. సినిమా త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది’’ అన్నారు.

సయీ మంజ్రేక‌ర్ మాట్లాడుతూ.. ‘‘నా తొలి చిత్ర‌మిది. స‌ల్మాన్‌ఖాన్‌గారితో క‌లిసి న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రేమాభిమానులు కావాల‌ని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘‘ద‌బాంగ్ సిరీస్ నాకెంతో ప్ర‌త్యేకం. ఇది మూడో భాగం. స‌యూ తొలిసారి న‌టిస్తుంది. మీ ప్రేమాభిమానాలు చూసి హ్యాపీగా అనిపించింది’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల త‌ర్వాత వెంక‌టేశ్‌గారిని క‌లిశాను. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌ని చూస్తుంటే చిరంజీవిగారిని చూస్తున్న‌ట్లే ఉంది. ద‌బాంగ్ 3 విష‌యానికి ప‌క్కా మాస్‌గా, యాక్ష‌న్ మూవీలా ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ‘‘స‌ల్మాన్‌గారంటే నాకెంతో ప్రేమ‌. స‌ల్మాన్‌గారు, చిరంజీవిగారు, సుదీప్‌గారు, వెంక‌టేష్‌గారు .. వీరంద‌రి నుండి ఓ విష‌యం నేర్చుకున్నాను. అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌. మా త‌రం హీరోలు వారి నుండి నేర్చుకున్న‌దిదే. ప్ర‌భుదేవాగారికి అభినంద‌న‌లు. సోనాక్షిసిన్హా, స‌యి, సుదీప్ స‌హా ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్’’ అన్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ,, ‘‘దబాంగ్ 3 తెలుగులో విడుద‌ల కావ‌డం అది కూడా తెలుగు డైలాగ్స్ ను స‌ల్మాన్ భాయ్ వాయిస్ నుండి విన‌డం బావుంది. తెలుగులో సినిమాను సూప‌ర్‌హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను. సోనాక్షిసిన్హా, సుదీప్‌, స‌యి స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

స‌ల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘‘హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎంతో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. హిందీలో నా సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యేవి. మంచి రెస్పాన్స్ వ‌స్తుండేవి. ఆ రెస్పాన్స్‌ను చూసి తెలుగులో కూడా రిలీజ్ చేయాల‌ని ద‌బాంగ్ 3ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. రామ్‌చ‌ర‌ణ్ నాకు ఎంతో స‌న్నిహితుడు. నా చిన్న‌త‌మ్ముడిగా భావిస్తాను. చిరంజీవిగారితో ఎంతో స‌న్నిహితం ఉంది. వెంకటేశ్‌గారితో 25ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంది. ప్ర‌భుదేవాగారు చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను..’’ అన్నారు.

Dabangg3 Movie Pre Release Event Details:

Dabangg3 Movie Pre Release Event at Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ