నాగ్ ఏం జరిగింది..? ఎందుకు పట్టించుకోవట్లే!

Mon 16th Dec 2019 04:48 PM
venky mama,akkineni nagarjuna,venkatesh,naga chaitanya,multistarrer  నాగ్ ఏం జరిగింది..? ఎందుకు పట్టించుకోవట్లే!
Why Akkineni Nagarjuna Doing These.. What Happend! నాగ్ ఏం జరిగింది..? ఎందుకు పట్టించుకోవట్లే!
Sponsored links

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కిన మ‌ల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ‌’. విక్టరీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టించారు.. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసి డిసెంబ‌ర్ 13న థియేటర్లలోకి రావడంతో పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు.. మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. కలెక్షన్ వర్షం కురుస్తోంది. సినిమా ఆశించిన దానికంటే మంచి నడుస్తుండటంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

అయితే సినిమా షూటింగ్ మొదలుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌.. రిలీజ్ వరకూ ఎక్కడేగానీ.. చైతూ తండ్రి.. అక్కినేని నాగార్జున మాత్రం ఎక్కడే గానీ అడ్రస్ కనిపించలేదు. కుమారుడి మూవీ అయితే ఏ మాత్రం పట్టించుకోరా..? అసలు ఆయన ఈ సినిమాకు సంబంధించిన ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు..? దీంతో ఆయన ఎందుకు పాల్గొనలేదనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ్ వస్తాడని ఆయన్ను చూసి ఆనందంలో మునిగి తేలొచ్చని భావించిన వీరాభిమానుల ఆశలు ఆవిరే అయ్యాయి. అంతేకాదు అఖిల్, సమంత కూడా పట్టించుకోలేదు.

అయితే.. నాగ్ ఎందుకిలా సైలెన్స్‌గా ఉన్నాడు..? అనే విషయంపై కాస్త లోతుగా వివరాలు సేకరించగా.. ఎక్కువ విక్టరీ పాత్రే ఉండటం.. సినిమాకే ఆయన హైలైట్ అవ్వడం.. మరోవైపు.. ఇది వెంకీ సినిమానే.. చైతూ పాత్ర పేద్దగా ఏమీ లేదు.. అని నాగ్ ఫీలయ్యారట. అందుకే ఇంత చేసినా ‘వెంకీమామ‌’ సంబంధించి చిత్రబృందంతో మాత్రం ఎక్కడా కలుసుకోలేదట. అయితే ఇప్పటికైనా సరే కనీసం సక్సెస్ మీట్స్, విజయోత్సవాల్లోగానీ పాల్గొంటే అక్కినేని అభిమానుల్లో జోష్ నింపినవారవుతురట. మరి ఇప్పటి వరకూ జరిగిన సంగతులు పక్కనెట్టి.. మున్ముంథు అయినా మన్మథుడు సినిమాకు సంబంధి కార్యక్రమాల్లో పాల్గొంటారే లేదే వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Why Akkineni Nagarjuna Doing These.. What Happend!:

Why Akkineni Nagarjuna Doing These.. What Happend!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019