వెంకీతో సినిమా కోసం కుర్ర డైరెక్టర్స్ పోటీ!?

Sat 14th Dec 2019 04:50 PM
young directors,75th movie,victory venkatesh,tarun bhaskar,anil raavipudi  వెంకీతో సినిమా కోసం కుర్ర డైరెక్టర్స్ పోటీ!?
Young director’s next with Victory Venkatesh వెంకీతో సినిమా కోసం కుర్ర డైరెక్టర్స్ పోటీ!?
Sponsored links

టాలీవుడ్‌ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సీనియర్ అయినా జూనియర్లతో అయినా చాలా కూల్‌ మింగిల్ అయిపోతుంటాడు.. అంతేకాదు.. కొత్త డైరెక్టర్ అయినా.. సీనియర్ డైరెక్టర్‌ కథ చెబితే కాస్త నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటాడు. అయితే తాజాగా మరో కుర్ర హీరో కమ్ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా ప్రస్తుతం వెంకీ.. ‘వెంకీమామ’ 73వ చిత్రం కాగా.. తదుపరి చిత్రం ‘అసురన్’ రీమేక్ 74వ చిత్రం కానుంది. అయితే 75వ చిత్రం తరుణ్ భాస్కర్‌ చేయనున్నాడట. సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్న వెంకటేశ్ 75వ సినిమాను గురించి అభిమానులు మాట్లాడుకుంటుండగా.. ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ వెలుగుచూసింది. ప్రిస్టేజ్‌గా భావించే ఈ 75వ చిత్రానికి సంబంధించి తరుణ్ సింగిల్ లైన్ వినిపించగా.. అది వెంకీకి తెగ నచ్చేసిందట. ‘రీమేక్ తొందరగానే అయిపోద్ది.. నువ్ కథ సిద్ధం చేసుకో తరుణ్..’ అని వెంకీ చెప్పినట్లు తెలియవచ్చింది. అంతేకాదు.. ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తన తరువాతి సినిమాని వెంకటేష్ హీరోగా రూపొందించేందుకు ప్రిపేర్ అవుతున్నానని ఆసక్తికర విషయం చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ‘అసురున్’ రీమేక్ పూర్తవ్వగానే.. వెంకీకి ‘ఎఫ్-2’తో సూపర్ డూపర్ హిట్టిచ్చిన అనీల్ రావిపూడి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే తాను ఎఫ్-3ని తెరకెక్కించబోతున్నట్లు అనీల్ అధికారికంగా ప్రకటించేశాడు. మొత్తానికి చూస్తే.. కుర్ర డైరెక్టర్‌‌లు ఇద్దరూ ‘నాతో అంటే నాతో సినిమా చేయండి’ అని గట్టిగానే పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్‌కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేకుంటే తనకు ఇదివరకే హిట్టిచ్చిన అనీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

Young director’s next with Victory Venkatesh:

Young director’s next with Victory Venkatesh  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019