పూజాకు ప్లేస్ ఇచ్చారు.. నాకేది అంటున్న రష్మిక!

Fri 13th Dec 2019 08:24 PM
rashmika mandanna,pooja hegde,feeling,sarileru neekevvaru,teaser,ala vaikunthapurramloo  పూజాకు ప్లేస్ ఇచ్చారు.. నాకేది అంటున్న రష్మిక!
Rashmika Feeling on Sarileru Neekevvaru Teaser పూజాకు ప్లేస్ ఇచ్చారు.. నాకేది అంటున్న రష్మిక!
Sponsored links

సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ సినిమాల టీజర్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. రెండు టీజర్స్‌లోను మహేష్ యాక్షన్ అండ్ కామెడీ పరంగా, అల్లు అర్జున్ కామెడీ అండ్ మాసివ్ లుక్‌తో అదరగొట్టేసాడు. అయితే ఈ రెండు టీజర్‌లలో ఉన్న ప్రధాన తేడా ఏమిటి అంటే... ‘అల వైకుంఠపురములో’ టీజర్‌లో త్రివిక్రమ్.. హీరోయిన్ పూజకి అన్యాయం చెయ్యకుండా 80 సెకన్ల టీజర్‌లో పూజ హెగ్డేని కూడా చూపెట్టాడు. గ్లామర్ లుక్స్‌తో పూజ, అల్లు అర్జున్ బాస్‌గా ఆకట్టుకుంది.

కానీ అనిల్ రావిపూడి సరిలేరు టీజర్‌లో అన్నీ అంటే.. అందరు నటులను చూపించినా హీరోయిన్ రష్మికాని చూపించకుండా దాచేసాడు. అయితే రష్మిక మీద స్పెషల్ టీజర్ అన్నప్పటికీ.. సరిలేరు టీం చడీచప్పుడు లేదు. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక, అల వైకుంఠపురములో పూజ కిచ్చిన ఇంపార్టెన్స్ చూసి తెగ ఫీలవుతుందట. అంత పెద్ద సినిమా టీజర్ కట్‌లో తనకి ప్లేస్ లేదు కానీ.. మరో సినిమాలో పూజని దర్శకుడు ఎంత హైలెట్ చేసాడో కదా అని మదనపడుతుందట. ఇక రష్మిక ఫీలవడం అటుంచి... సోషల్ మీడియాలో కూడా అల వైకుంఠపురములో పూజని చూసిన వారు.. సరిలేరు నీకెవ్వరులో రష్మిక లేకపోవడంతో.. మీమ్స్ మీమ్స్ చేసి కామెడీ చేసేస్తున్నారు.

Sponsored links

Rashmika Feeling on Sarileru Neekevvaru Teaser:

Rashmika Mandanna vs Pooja Hegde 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019