షాలినీ పాండే లక్కీ ఛాన్స్.. ఫుల్ జోష్!!

Shalini Pandey to make her Bollywood debut with Ranveer Singh’s Jayeshbhai Jordaar

Fri 13th Dec 2019 11:43 AM
arjun reddy actress,shalini pandey,bollywood,ranveer singh,jayeshbhai jordaar  షాలినీ పాండే లక్కీ ఛాన్స్.. ఫుల్ జోష్!!
Shalini Pandey to make her Bollywood debut with Ranveer Singh’s Jayeshbhai Jordaar షాలినీ పాండే లక్కీ ఛాన్స్.. ఫుల్ జోష్!!
Advertisement

‘షాలినీ పాండే’ని టాలీవుడ్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యూత్‌కు ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దాదాపు అందరూ ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసే ఉంటారు గనుక. ఈ మూవీ చూసిన సినీ ప్రియులకు షాలిని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘అర్జున్ రెడ్డి’లో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసిన తర్వాత పెద్దగా టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. అంతేకాదు.. ఈ ముద్దుగుమ్మ పని ఇంతటితో అయిపోయిందని అందరూ భావించారు. దీంతో గ్యాప్ వస్తే బాగోదని తమిళంలోను గట్టిగానే ట్రై చేసింది.. అయితే అక్కడ కూడా ఆశించినస్థాయిలో అవకాశాలు వరించకపోవడంతో ఇక ఏకంగా బాలీవుడ్‌ను దున్నేయాలని అనుకుందో ఏమోగానీ అక్కడ అవకాశాల కోసం తెగ వెతికింది. చివరికి ఆ మధ్య మూడు భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని టాక్ నడిచింది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం మూడు సినిమాల్లో కాదు కానీ.. ఒక్క సినిమాలో మాత్రం నటిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మనీశ్ శర్మ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా షాలినీని ఎంపిక చేసుకున్నారు. అయితే చాలా రోజులుగా బాలీవుడ్‌ ఛాన్స్ కోసం వేచి చూస్తున్న ఈ బ్యూటీకి అవకాశం రావడంతో ఫుల్ ఖుషీ అవుతోంది. అయితే ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని.. ఇక అవకాశాల కోసం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదని షాలిని భావిస్తోందట. ‘అర్జున్‌రెడ్డి’తో టాలీవుడ్‌లో కుర్రకారు హృదయాలను దోచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్‌లో ఏ మాత్రం సక్సెస్ అవుతుందో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Shalini Pandey to make her Bollywood debut with Ranveer Singh’s Jayeshbhai Jordaar:

Shalini Pandey to make her Bollywood debut with Ranveer Singh’s Jayeshbhai Jordaar  


Loading..
Loading..
Loading..
advertisement